Shuru
Apke Nagar Ki App…
26 January
KR NEWS 369
26 January
More news from తెలంగాణ and nearby areas
- 26 January1
- కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు గణతంత్ర 77 దినోత్సవం సందర్భంగా బాల్కొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సింగరేణి కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఆయన, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.1
- నిజామాబాదు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు లేవని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పూర్తిగా దుర్గంధముగా మారిందని, పైప్ లైన్ లీకేజీ తో దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. ఆసుపత్రిలో సైతం సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు.1
- జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు -జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ -పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా] నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్‌ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, NCC పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏ.వో షాదబ్ హకిమ్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమబంధిత కార్యాలయాల సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ....భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు. జిల్లాలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర విభాగాల్లో సాధించిన పురోగతి పై ఆయన విభాగాల వారీగా ఉపన్యాసించారు. వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్–రబీ సీజన్లలో పంటల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కెట్ యార్డుల్లో MSP చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో జిల్లాలో PHC, CHC, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్‌ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుపడినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, CC రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, త్రాగునీటి సరఫరా వంటి పౌరసేవలు అమలు అవుతున్నాయని తెలియజేశారు. పట్టణాభివృద్ధిలో రోడ్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ట్యాంకుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు అమలు అవుతున్నాయని వివరించారు.4
- *గణ తంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు డా నరేష్ జాదవ్* ఆదిలాబాద్ జిల్లా : గణ తంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణం లోని గాంధీ చౌక్ , అంబేద్కర్ చౌక్ , నేతాజీ చౌక్, నెహ్రూ చౌక్ , భగత్ సింగ్ నగర్ ,క్రాంతి నగర్ , ఖానాపూర్, బంగారి గూడా, పట్టణంలో కాలొని వాసుల తో కలసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు డా నరేష్ జాదవ్ ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలనీ వాసులకు గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్,మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ నహీద్,ఆదిలాబాద్ రూరల్ మండలం నాయకులు సంజయ్ దూబే,ఫహీం,మాజీ కౌన్సిలర్ మూర్తుజా, మాజీ కౌన్సిలర్ వసీమ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు1
- సూర్య ధన్వంతరి దేవాలయంలో వైభవంగా ఆరోగ్య హోమము.. జగిత్యాల పట్టణంలోని శ్రీ సూర్యధర్మంతరి దేవాలయంలో సోమవారం స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమి, సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ ఉదయం 10 గంటలకు. ఆరోగ్య హోమ కార్యక్రమంలో భక్తులు పాల్గొని హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే. సూర్య భగవానుని మాల తీసుకున్న భక్తులు స్వామి అమ్మవాలను దర్శించుకొని అనంతరం దీక్షా మాల విరమణ చేశారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమములో ఫౌండర్ &ఛైర్మెన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న, మేనేజంగ్ ట్రస్ట్ గట్టు రాజేందర్, ప్రెసిడెంట్ ముత్యాల రామలింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వోడ్నాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్షి వడ్ల గట్ట శంకర్, తిరుపతి, రాజశేఖర్, గంగాధర్, మల్లేశం- లలిత అర్చకులు ప్రణయ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.1
- మహనీయులను స్పూర్తిగా చేసుకోవాలి మహనీయులను స్పూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని సోమవారం జన్నారం మండల కేంద్రంలోని లిటిల్ హన్స్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ చదువుకొని ముందు అడుగు వేయాలన్నారు. పాఠశాల చైర్మన్, మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న ఘనత తమ విద్యాసంస్థలదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ లో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు నగరంలోని గౌతమ్ నగర్ 17వ డివిజన్ కు చెందిన యువకులు జనసేన జిల్లా ఇన్చార్జి గుండా సంతోష్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కండువా కప్పి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.1