యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. బైబిల్‌లోని భక్తులు నడిచిన నీతి మార్గంలో యువత నడవాలి. డాక్టర్ గిద్యోన్. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. బైబిల్‌లోని భక్తులు నడిచిన నీతి మార్గంలో యువత నడవాలి. డాక్టర్ గిద్యోన్. నేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు ఆకర్షితులు కాకుండా మంచి మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని డాక్టర్ గిద్యోన్ సూచించారు. యువత దేశానికి, సమాజానికి భవిష్యత్ బలమని, వారి ఆలోచనలు, ప్రవర్తన సరైన దిశలో ఉంటే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బైబిల్‌లో దేవునిపై విశ్వాసంతో, నీతిగా జీవించిన భక్తుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దావీదు, యోసేపు, దానియేలు వంటి భక్తులు ఎన్నో కష్టాలు, ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో నిలిచారని, వారి జీవితాలు నేటి యువతకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. ‘నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు’ అనే విశ్వాసంతో యువత నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేమ, క్షమ, సేవాభావం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. చెడు వ్యసనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబ సంబంధాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే సత్కార్యాలు చేయడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, ఇతరులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, సమాజం కోసం మంచి పనులు చేయడం ద్వారా యువతలో బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు. యువత చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, మంచి స్నేహాలను ఎంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. యువత జీవితంలో మంచి మార్పు వస్తే కుటుంబాలు బలపడటంతో పాటు సమాజం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని డాక్టర్ గిద్యోన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, మండల ప్రధాన కార్యదర్శి కులేరి దీప్తి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్, పాస్టర్ ప్రేమ్ కుమార్, దేవయ్య, డానియల్, దేవరాజ్, యోబు, జోనతన్, డేవిడ్, కులేరి కిషోర్ కుమార్‌తో పాటు సుమారు 100 మంది పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. బైబిల్‌లోని భక్తులు నడిచిన నీతి మార్గంలో యువత నడవాలి. డాక్టర్ గిద్యోన్. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. బైబిల్‌లోని భక్తులు నడిచిన నీతి మార్గంలో యువత నడవాలి. డాక్టర్ గిద్యోన్. నేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు ఆకర్షితులు కాకుండా మంచి మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని డాక్టర్ గిద్యోన్ సూచించారు. యువత దేశానికి, సమాజానికి భవిష్యత్ బలమని, వారి ఆలోచనలు, ప్రవర్తన సరైన దిశలో ఉంటే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. బైబిల్‌లో దేవునిపై విశ్వాసంతో, నీతిగా జీవించిన భక్తుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దావీదు, యోసేపు, దానియేలు వంటి భక్తులు ఎన్నో కష్టాలు, ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో నిలిచారని, వారి జీవితాలు నేటి యువతకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. ‘నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు’ అనే విశ్వాసంతో యువత నిజాయితీ, క్రమశిక్షణ, ప్రేమ, క్షమ, సేవాభావం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. చెడు వ్యసనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబ సంబంధాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే సత్కార్యాలు చేయడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, ఇతరులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, సమాజం కోసం మంచి పనులు చేయడం ద్వారా యువతలో బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు. యువత చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, మంచి స్నేహాలను ఎంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. యువత జీవితంలో మంచి మార్పు వస్తే కుటుంబాలు బలపడటంతో పాటు సమాజం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని డాక్టర్ గిద్యోన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, మండల ప్రధాన కార్యదర్శి కులేరి దీప్తి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజేష్, పాస్టర్ ప్రేమ్ కుమార్, దేవయ్య, డానియల్, దేవరాజ్, యోబు, జోనతన్, డేవిడ్, కులేరి కిషోర్ కుమార్‌తో పాటు సుమారు 100 మంది పాల్గొన్నారు.
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- కరీంనగర్‌లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మాట్లాడారు..... ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు “సేవా సంకల్ప్ అభియాన్” నిర్వహిస్తామని తెలిపారు. ఆశీర్వాద దీపం, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు పోటీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇక ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మా బొరుసుల్లా మారాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తామని.. తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లలు3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.1
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.1