**శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్‌ను కలిసిన ధర్మవరం టీడీపీ నేతలు** **పరిటాల శ్రీరామ్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని వినతి** **ధర్మవరం, ఏప్రిల్ 21:* జిల్లా పర్యటనలో భాగంగా ధర్మవరం విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ **మహ్మద్ అహ్మద్ షరీఫ్**కు ధర్మవరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఎర్రగుంటలోని టీడీపీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కొందరు నేతలు పార్టీని విడిచి వెళ్లినా పరిటాల కుటుంబం కార్యకర్తలకు, నాయకులకు కొండంత అండగా నిలబడిందని గుర్తుచేశారు. పొత్తులో భాగంగా చివరి నిమిషంలో ధర్మవరం స్థానం బీజేపీకి కేటాయించినప్పటికీ, అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు పోరాట పటిమతో కూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేశారని వివరించారు. **శ్రీరామ్‌కు ప్రొటోకాల్ పదవిపై విన్నపం:** దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు ఎలాంటి ప్రొటోకాల్ పదవి లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన శ్రీరామ్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. కచ్చితంగా మీరు చెప్పిన విషయాలను పార్టీ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. **అమరావతి కోసం మీ పోరాటం అభినందనీయం:** గత ప్రభుత్వ హయాంలో శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించినా, వెనక్కి తగ్గకుండా రాజధాని అమరావతి కోసం షరీఫ్ ప్రదర్శించిన ధైర్యం, పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి, దూదేకుల ఫెడరేషన్ డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్, ఫణి కుమార్, నాగూర్ హుస్సేన్, రహీమ్, శామీర్, అస్లాం, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రెవిన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం లో అసెంబ్లీ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో ఉదయం 11:00 గంటలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వెల్లడించిన ఓటర్ల వివరాలు: • *ధర్మవరం 160 అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,48,012 మంది ఓటర్లు ఉన్నారు* • పురుషులు : 1,22,706 • మహిళలు : 1,25,285 • ఇతరులు : 21 *18 సంవత్సరాలు నిండిన యువతీ–యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కు నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.* అలాగే ఓటరు జాబితాలో కొత్త నమోదులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ,ఎలక్షన్ సీనియర్ సహాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.1
- మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు1
- రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం కాదలూరు గ్రామంలో ఎమ్మెల్యే కాలువ ఆధ్వర్యంలో ప్రగతి పదం ముగింపు వేడుకలు. ఎంపీ పార్థసారథి, రాష్ట్ర సలహాదారుడు షరీఫ్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూర్తయిన 6 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.1
- ఆలూరు నియోజకవర్గం లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఆలూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే విరుపాక్షి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు... గత 25 రోజుల నీళ్లు రాకపోవడంతో వైసీపీ నేతలు గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు... అధికారులకు పలుమార్లు విన్నవించిన స్పందించలేదని అగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది..1
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- *అర్ధరాత్రి రైలులో బంగారందోపిడి* *ప్రయాణికులను కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు* బెంగుళూరు-నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో.. 4 కోచ్‌లలో అర్ధరాత్రి దోపిడీ. ప్రధానంగా S7, S11, S12, S13 కోచ్‌లలో ప్రయాణికుల నుంచి సుమారు 11 తులాలు బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు అప్పికట్లలో రైలును ఆపి సుమారు పది మంది దుండగులు దిగి పారిపోయిన వైనం. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నరైల్వే పోలీసులు.1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- తాగునీటి కొరత తీర్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు గుడీబండ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మండలంలో తాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మంగళవారం బోరు వేయించగా నీరు పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామికి, బాలల హక్కులకు కమిషన్ చైర్మన్ డాక్టర్ డి శ్రీనివాసమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు1