Shuru
Apke Nagar Ki App…
ఈరోజు అనగా ది 27 ఆగస్టు 2026 పెనుబల్లి ముత్యాలమ్మ గుడి కనీసం ఏర్పాటుకు సన్నాహాలు మహోత్సవ నిర్వహిస్తున్నారు పెనుబల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ---------------------------------------- ముత్యాలమ్మ అమ్మవారి గుడి పైన కలశం ఏర్పాటు మహోత్సవము 27-8-2026 గురువారం ఉదయం 8-00 గంటలకు పెనుబల్లి రామాలయం వద్ద నుండి ముత్యాలమ్మ గుడి వరకు మేళతాళములతో బయలుదేరవలెను కలశము ఇచ్చిన దాతలు ఆ సంటి శ్రీనివాసరావు కృష్ణకుమారి దంపతులు కొలిపాక రవికుమార్ స్వాతి దంపతులు కావున ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆలయ అభివృద్ధికి విరాళములు ఇచ్చిన దాతలు అందరూ హాజరై అమ్మవారికి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 🙏🙏🙏🙏🙏🙏 ఇట్లు ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ పెనుబల్లి ఖమ్మం జిల్లా
Chalamala narasimharao
ఈరోజు అనగా ది 27 ఆగస్టు 2026 పెనుబల్లి ముత్యాలమ్మ గుడి కనీసం ఏర్పాటుకు సన్నాహాలు మహోత్సవ నిర్వహిస్తున్నారు పెనుబల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ---------------------------------------- ముత్యాలమ్మ అమ్మవారి గుడి పైన కలశం ఏర్పాటు మహోత్సవము 27-8-2026 గురువారం ఉదయం 8-00 గంటలకు పెనుబల్లి రామాలయం వద్ద నుండి ముత్యాలమ్మ గుడి వరకు మేళతాళములతో బయలుదేరవలెను కలశము ఇచ్చిన దాతలు ఆ సంటి శ్రీనివాసరావు కృష్ణకుమారి దంపతులు కొలిపాక రవికుమార్ స్వాతి దంపతులు కావున ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆలయ అభివృద్ధికి విరాళములు ఇచ్చిన దాతలు అందరూ హాజరై అమ్మవారికి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 🙏🙏🙏🙏🙏🙏 ఇట్లు ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ పెనుబల్లి ఖమ్మం జిల్లా
More news from Khammam and nearby areas
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను – భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1
- నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.1