logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండగా, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు వేములవాడ మూలవాగు మీదుగా మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

1 hr ago
user_సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 hr ago

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. కొనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్ట్

పూర్తిస్థాయిలో నిండగా, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు వేములవాడ మూలవాగు మీదుగా మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి

దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద

నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    2
    హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    2
    అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.
ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    user_P S REDDY
    P S REDDY
    Food Processing Company కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 day ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, అదనపు చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుంచి రూ.4 వేల వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, అదనపు చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుంచి రూ.4 వేల వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద రైతులకు నిలిచిపోయిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద రైతులకు నిలిచిపోయిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలో ఇటీవల వెలుగుచూసిన వడ్ల కుంభకోణం కారణంగా ఎంతోమంది పేద రైతులకు ఇప్పటికీ రావాల్సిన చెల్లింపులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, నిలిచిపోయిన ధాన్యం సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిరసనకారులు వరి ధాన్యాన్ని రహదారిపై పోసి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై, రైతుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడటం సరికాదని దుయ్యబట్టారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
    4
    వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద రైతులకు నిలిచిపోయిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు
వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద రైతులకు నిలిచిపోయిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలో ఇటీవల వెలుగుచూసిన వడ్ల కుంభకోణం కారణంగా ఎంతోమంది పేద రైతులకు ఇప్పటికీ రావాల్సిన చెల్లింపులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, నిలిచిపోయిన ధాన్యం సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నిరసనకారులు వరి ధాన్యాన్ని రహదారిపై పోసి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై, రైతుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడటం సరికాదని దుయ్యబట్టారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.