Shuru
Apke Nagar Ki App…
కర్నూలు: జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను కలిసిన ప్రజలు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ క్యాంప్ కార్యాలయలో పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు కలిశారు. వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. ప్రతీ ఒక్కరి అభ్యర్థనను శ్రద్ధగా విని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
Ulidra Raju
కర్నూలు: జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను కలిసిన ప్రజలు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ క్యాంప్ కార్యాలయలో పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు కలిశారు. వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. ప్రతీ ఒక్కరి అభ్యర్థనను శ్రద్ధగా విని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Magathala Siddhartha2
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యా విధానం-2026" పేరిట రిపోర్ట్ తయారు చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా విధానం – 2026” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచందర్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లు ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. తిరుపతి రావు, ప్రొఫెసర్ పి. మురళి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ,.. ఇటీవల విద్యా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. విద్యా విధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని సూచించారు. కాని తెలంగాణలో విద్యా వ్యవస్థ గత బీఆర్‌ఎస్ పాలనలోనే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందన్నారు. విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్, మిడ్‌డే మీల్స్ వంటి కనీస సదుపాయాలు కూడా సరిపడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, రైట్ టు ఎడ్యుకేషన్ అమలుపై కూడా కేంద్ర విధానంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలు వివాదాస్పదంగా మారాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదని, సంస్కృతం ప్రాచీన భాషగా దేశ సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సంస్కృతాన్ని తొలగించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలను తొలగించాలనడం కూడా అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందన్న ప్రచారం సరికాదని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ విద్యా వ్యవస్థ తీవ్ర వైఫల్యాన్ని ఎదుర్కొంటోందని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తయారుచేసేటప్పుడు విద్యావంతులు, విద్యా నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదని అన్నారు.2
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1