logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

31ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం కన్నాయిగూడెంలో స్నేహితుల రోజు జ్ఞాపకాలు 31 ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం స్నేహానికి వయసుతో సంబంధం లేదని, నిజమైన స్నేహం కాలం గడిచే కొద్దీ మరింత బలపడుతుందని నిరూపిస్తున్నారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు. సునార్కని నర్సింహారావు, గాంధర్ల సమ్మయ్య, చింతగూడెం గ్రామానికి చెందిన దుర్గం రాజు. ఈ ముగ్గురు 1995 నుంచి ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్థలు లేకుండా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ముగ్గురిలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మిగతా ఇద్దరూ ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. నర్సింహారావు ఖమ్మంలో మెడికల్‌ రంగంలో స్థిరపడగా, సమ్మయ్య ఆటో నడుపుతూ బుట్టాయిగూడెం గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. దుర్గం రాజు చింతగూడెం గ్రామంలో వ్యవసాయంతో పాటు ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్కను ముగ్గురు స్నేహితులు కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు. నేటి తరానికి వీరి స్నేహం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

3 hrs ago
user_Panthangi nagaraju patel
Panthangi nagaraju patel
Kannaigudem, Mulugu•
3 hrs ago
07a201a3-b941-4942-809c-f467e3424c52

31ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం కన్నాయిగూడెంలో స్నేహితుల రోజు జ్ఞాపకాలు 31 ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం స్నేహానికి వయసుతో సంబంధం లేదని, నిజమైన స్నేహం కాలం గడిచే కొద్దీ మరింత బలపడుతుందని నిరూపిస్తున్నారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి

d2b1565e-9da7-4e0e-9d0b-aa0696cb3d6d

చెందిన ముగ్గురు స్నేహితులు. సునార్కని నర్సింహారావు, గాంధర్ల సమ్మయ్య, చింతగూడెం గ్రామానికి చెందిన దుర్గం రాజు. ఈ ముగ్గురు 1995 నుంచి ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్థలు లేకుండా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ముగ్గురిలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మిగతా ఇద్దరూ

77915e41-da02-4a62-b34c-618e697b5712

ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. నర్సింహారావు ఖమ్మంలో మెడికల్‌ రంగంలో స్థిరపడగా, సమ్మయ్య ఆటో నడుపుతూ బుట్టాయిగూడెం గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. దుర్గం రాజు చింతగూడెం గ్రామంలో వ్యవసాయంతో పాటు ప్రముఖ దినపత్రికలో జర్నలిస్ట్‌గా

b38497e7-a7ba-4ed2-ae67-00bfae012c6b

కొనసాగుతున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్కను ముగ్గురు స్నేహితులు కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు. నేటి తరానికి వీరి స్నేహం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    1
    వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️

*✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️
*మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.*
*పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.*
*ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.*
*ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    1
    భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం......
భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి.
అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shivaram
    Shivaram
    Local News Reporter భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
    1
    చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    1
    ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం
సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు
    1
    భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు 
భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.