logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

3 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
3 hrs ago

రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
    1
    రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్
రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని  తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు.
సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.
ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని  పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.
ఈ పర్యటనలో  (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా 
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    4
    రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు
    1
    చరిత్ర పురుషుడు అంబేద్కర్ 
 ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో  ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.
బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న  పుస్తకం.
చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం  అని అన్నారు.
చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్  లు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు.‌ తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
    1
    బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర...ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచి పెడతాం-కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కరీంనగర్ లో ప్రకటించారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ భూదోపిడీని ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోందని, బీఆర్ఎస్ కు సంబంధించి 8గురు ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టిందని మరి 90 మంది ఎమ్మెల్యేల భూభాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలని ప్రశ్నించారు.‌ తెలంగాణలో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవని, 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదు...కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాల భూములను దోచుకున్నారని ఆరోపించారు.
పాదయాత్రలో బీఆర్ఎస్ భూదోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తా అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా..? సీఎంకు బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి డీల్ కోసం బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్ ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
    2
    తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న నూతన కలెక్టరేట్

 ములుగు జిల్లా, సెప్టెంబర్ 16 (భారత శక్తి): నేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • కార్మికుల పై నిర్భందాన్ని నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు.* *2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.* *ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.* ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    కార్మికుల పై నిర్భందాన్ని  నిరసిస్తూ సామూహిక నిరసన దీక్ష
ఈ రోజు CITU ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం ముందు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి గారు ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ మహేందర్ జి గారికి, జిల్లా ఎస్ పి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ   గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. స్కీం వర్కర్లఐన ఆశా, అంగన్వాడి తదితరులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన - పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది కార్మికుల హక్కులను  అప్రాజాస్వామికంగా నిరాకరించటమేనని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం  కాదని విమర్శించారు.*
*2026 సెప్టెంబర్ 8,9తేదీల్లో జరిగిన అంగన్వాడీ,ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు.*
*ఆశా వర్కర్స్, అంగన్వాడి లకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్ సౌకర్యం అమలు,గ్రామ పంచాయితీ, మున్సిపల్,RTC విద్యుత్,  ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్, హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాము.వీటి ఎజెండా కోసం  ఆందోళన- పోరాటాలు చేస్తున్నారు. బాధ్యత కల్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను పరిష్కరించాలి.పరిష్కరించకుండా ఆందోళనా-పోరాటాలు నిర్వహిస్తున్న కార్మికులను అణచివేస్తూ తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారనీ అన్నారు.*
ఈ కార్యక్రమం లో  సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతి, గుండె బోయిన రవిగౌడ్, కురేందుల సమ్మక్క, శ్రావ్య, రమాదేవి, శ్రీనాథ్, మహేష్, పద్మ, భాగ్య, సరిత, లక్ష్మీనరసమ్మ , నాగమణి, సంధ్య, పూర్ణ, సుధా, వెంకటరమణ , సడాలు, రజిత, కవిత, సమ్మక్క ఆశా అంగన్వాడి, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు,  తదితరులు పాల్గొన్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    1
    ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు 
గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను:
1)	పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
2)	మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు.
ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.