జీవన్ రెడ్డి పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్...కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం...మరో మారు అధికారంలోకి వస్తామని వెల్లడి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్...కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం...మరో మారు అధికారంలోకి వస్తామని వెల్లడి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన,
ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు
నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం
ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.1
- హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.1
- వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.1
- Post by Venu Gopal1
- జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.1