కొండన్న పల్లిలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
కొండన్న పల్లిలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
- జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.1
- మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలను జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని గ్రంథాలయం వద్ద నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి బాపులే సేవలను కొనియాడారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ఇక్కడి శాసన సభ్యుడు అధికార పార్టీ అవునా కాదా అని ఆలోచించడం లేదని అభివృద్ధి సంక్షేమం ప్రతి ఒక్కరి అందాలని పని చేస్తున్నామని అన్నారు.నేతన్నల సమస్యలను పరిస్కరిస్తున్నాం చేతి నిండా పనులను కల్పిస్తున్నాం మహిళలకు చీరల పంపిణీ కోసం సిరిసిల్లకు ఆర్డర్లు వస్తున్నట్లు ఆయన తెలిపారు.సిరిసిల్లలో 25 హెచ్ పి లోకి వచ్చే వారికి ఆనాడు ఎవరు ఆపారని ఎవరు మళ్ళీ 25 హెచ్ పి పరిధిలోకి కలిపారో ఒక్క సారి ఆలోచన చేయాలని అన్నారు.సెస్ పాలకవర్గం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించండి అని 10 సార్లు సమావేశం పెడితే స్పందించలేదు అని అన్నారు. ఈనాడు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడాలని నేత పరిశ్రమ మరింత ముందుకు పోతుందని ఆనాడు 10 హెచ్ పిలు చేసింది కాంగ్రెస్ ఏ అని ఈనాడు 25 హెచ్ పి లు చేసింది కాంగ్రెస్ ఏ అని అన్నారు.4
- Post by Venu Gopal1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాతిశిల విరిగిపడి గాయాలైన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్-స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినాన్ని ఆదివారం హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క కేక్ కట్ చేసి బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం నింపుతూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.1
- చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు శివారులో సిపిఐ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజారాణి, ఎలుకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదన్నపేట ప్రాంత గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు మరుగుదొడ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ మైలారం మల్లికార్జున స్వామి ఆలయంను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం సందర్శించారు. మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహిస్తున్న శ్రీ వీర ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని మైలారం మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షణ నిర్వహించి ఆ మార్గంలో నిర్మిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలను దర్శించారు. వీరిని ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరుశరాములు, ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, నూకల తిరుపతి, జక్కన్న పెళ్లి సత్తయ్య, బద్ధం శ్రీనివాస్ రెడ్డి అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే జయంతిని టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు.సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. జ్యోతిరావు పూలే దంపతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా వెనుకడుగు వేయకుండా, విద్యకు పునాది వేసి సమాజాన్ని చైతన్యవంతం చేశారని తెలిపారు.భారతదేశంలో మహిళల విద్యాభివృద్ధికి మార్గం చూపిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాధించడం మన అందరి బాధ్యత అని అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జ్యోతిరావు పూలే ఆశయాల దారిలోనే పాలన సాగించారని గుర్తు చేశారు.విద్యార్థులు, యువత జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కె అప్రోచ్ ఎండి సమీర్ లింగంపల్లి అబ్బి ప్రశాంత్ సత్యనారాయణ రాజు ముజ్జు రమేష్ నరేంద్ర పాల్గొన్నారు.1