logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🟥 సిపిఐ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు – నర్సంపేటలో 100 కుటుంబాలు మార్పు 🟥 వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు శివారులో సిపిఐ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజారాణి, ఎలుకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదన్నపేట ప్రాంత గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు మరుగుదొడ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

18 hrs ago
user_Mediya wgl medical wgl
Mediya wgl medical wgl
Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
18 hrs ago

🟥 సిపిఐ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు – నర్సంపేటలో 100 కుటుంబాలు మార్పు 🟥 వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు శివారులో సిపిఐ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజారాణి, ఎలుకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ

కార్యక్రమంలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదన్నపేట ప్రాంత గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు మరుగుదొడ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
    1
    జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. 
వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్
తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్  పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. 
ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది..
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు..
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
    4
    మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్  ఏలేటి చంద్రారెడ్డి  ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.