Shuru
Apke Nagar Ki App…
కాసింపేట గ్రామంలో మానసా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు.... గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
Vodnala thirupthi
కాసింపేట గ్రామంలో మానసా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు.... గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.3
- Post by Venu Gopal1
- మెట్ పల్లి, ఏప్రిల్ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.3
- వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.1
- గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1