మృతుడి అంత్యక్రియలకు ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్ ఆర్థిక సహాయం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అలువాల రమేష్ అనారోగ్యంతో మరణించగా మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ తన ఫౌండేషన్ తరపున అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. రమేష్ పచ్చకామెర్ల వ్యాధితో బుధవారం తెల్లవారుజామున మరణించాడు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల కోసం సహాయం అందించాలని ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్ కు గ్రామస్తులు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీంతో దామోదర్ యాదవ్ మానవతా దృక్పథంతో స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఫౌండేషన్ సభ్యుడు, స్థానిక యాదవ సంఘం అధ్యక్షుడు తమ్మడవేణి అంజయ్య ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య వెంట బీసీ జిల్లా కన్వీనర్ తమ్మడవేణి శ్రీనివాస్, వార్డు సభ్యులు కొమ్మ శ్రావణి, వేల్పుల కుమార్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి మూదాం శ్రావణ్, అల్వాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి అంత్యక్రియలకు ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్ ఆర్థిక సహాయం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అలువాల రమేష్ అనారోగ్యంతో మరణించగా మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ తన ఫౌండేషన్ తరపున అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. రమేష్ పచ్చకామెర్ల వ్యాధితో బుధవారం తెల్లవారుజామున మరణించాడు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల కోసం సహాయం అందించాలని ఎన్ఆర్ఐ దామోదర్ యాదవ్ కు గ్రామస్తులు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీంతో దామోదర్ యాదవ్ మానవతా దృక్పథంతో స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఫౌండేషన్ సభ్యుడు, స్థానిక యాదవ సంఘం అధ్యక్షుడు తమ్మడవేణి అంజయ్య ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య వెంట బీసీ జిల్లా కన్వీనర్ తమ్మడవేణి శ్రీనివాస్, వార్డు సభ్యులు కొమ్మ శ్రావణి, వేల్పుల కుమార్, బీసీ ఆజాద్ ఫెడరేషన్ ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి మూదాం శ్రావణ్, అల్వాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- User1864Srirampur, Peddapalli🙏on 11 March
- User1864Srirampur, Peddapalli🙏on 11 March
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మక్కల రాక భారీగా పెరగడంతో యార్డ్ పూర్తిగా నిండిపోయింది. కల్లెడ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కాంటాలు నెమ్మదిగా జరగడం, లారీల రాక ఆలస్యం కావడం వల్ల కొత్తగా వచ్చే ధాన్యానికి స్థలం లేకపోయింది. దీంతో వారం రోజుల పాటు రైతులు మొక్కజొన్నలను తీసుకురాకూడదని అధికారులు సూచించారు.1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. లంచ్ అవర్స్ లో రెడ్ బ్యాడ్జిలు ధరించి బ్యాంకు ముందు ధర్నా చేశారు. డి.సి.సి.బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్/ఎక్స్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రికవరీ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మే రెండు నుంచి సమ్మె చేపడతామని సమ్మె నోటిస్ తెచ్చారు. ఈనెల 24న వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే 23, 24న అధికారులకు మెమోరండం సమర్పిస్తామని, 27న డి.సి.సి. బ్యాంకుల ప్రధానకార్యాలయము ముందు ధర్నా చేస్తామన్నారు. 29న ధర్నా, సామూహిక శెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానకార్యాలయము హైదరాబాద్ ముందు 9 జిల్లాల సహకార బ్యాంకు ఉద్యోగులచే ధర్నా నిరసన కార్యక్రమాలు. ఉంటాయని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే మే 2న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.2