logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజా ధనం దోపిడి.. సన్నవడ్ల బోనస్‌లో భారీ అక్రమాలు అచ్చంపేట, ఏప్రిల్ 01,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సన్నవడ్ల బోనస్ పథకంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ చైర్మన్‌కు మంగళ వారం వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగీనేని శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు సహాయంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించగా, అంబటిపల్లి గ్రామానికి చెందిన మాజీ పి ఏ సీ ఎస్ (PACS) చైర్మన్ కుటుంబ సభ్యులు దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అసలు వరి సాగు చేయకపోయినా, రికార్డులను తారుమారు చేసి దాదాపు 1400 క్వింటాళ్ల సన్నవడ్లు విక్రయించినట్లు చూపించారని వారు పేర్కొన్నారు. ఈ తప్పుడు లెక్కలతో పేద రైతులకు అందాల్సిన సుమారు రూ.8 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్నా, అసలు జాబితాలో పేర్లు లేకపోయినా బోనస్ పొందడం వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారి నుండి సొమ్మును రికవరీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన అర్హులైన రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.

19 hrs ago
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
19 hrs ago
c0837e0d-e1fc-454e-a6d7-ce2edf7e875e

ప్రజా ధనం దోపిడి.. సన్నవడ్ల బోనస్‌లో భారీ అక్రమాలు అచ్చంపేట, ఏప్రిల్ 01,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సన్నవడ్ల బోనస్ పథకంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ చైర్మన్‌కు మంగళ వారం వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగీనేని శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు సహాయంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించగా, అంబటిపల్లి గ్రామానికి చెందిన మాజీ పి ఏ సీ ఎస్ (PACS) చైర్మన్ కుటుంబ సభ్యులు దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అసలు వరి సాగు చేయకపోయినా, రికార్డులను తారుమారు చేసి దాదాపు 1400 క్వింటాళ్ల సన్నవడ్లు విక్రయించినట్లు చూపించారని వారు పేర్కొన్నారు. ఈ తప్పుడు లెక్కలతో పేద రైతులకు అందాల్సిన సుమారు రూ.8 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. భూమి విస్తీర్ణం తక్కువగా ఉన్నా, అసలు జాబితాలో పేర్లు లేకపోయినా బోనస్ పొందడం వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారి నుండి సొమ్మును రికవరీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన అర్హులైన రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    1
    ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో
గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    1
    *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు*
*ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    దరూరు మండల కేంద్రములో  శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్.
********<<<<<<>>>>>>********
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి  ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో  ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి… శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి… సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి… రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు… రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    1
    ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3 వేల ఏళ్ల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి…
శాతవాహన సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి…
సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం అమరావతి…
రాజధాని కోసం 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు…
రైతులకు ఆ భరోసా ఇచ్చిన శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు.
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.
    1
    a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..
    1
    పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు!
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, 
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.... ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తపరిచారు... ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం.. జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది... లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది... మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది... కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి... "ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు... కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు... రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.. నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి... వాహన యజమానులు జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి... వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హెచ్చరిక చేశారు... మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు....
ప్లకార్డులు పట్టుకుని,  నిరసన వ్యక్తపరిచారు...
ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:
ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం..
జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది...
లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది...
మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది...
కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి...
"ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు...
కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు...
రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి..
నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి...
వాహన యజమానులు
జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు..
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి...
వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
హెచ్చరిక చేశారు...
మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.