Shuru
Apke Nagar Ki App…
వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు
Thalapalli Ramesh
వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు1
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహోత్సవం అధ్యక్షులు కన్న కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు సేవాదళ్ నాయకులు జిల్లా యువజన నాయకులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు1
- లక్షెట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఊట్కూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట్ బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, జిల్లా కోశాధికారి, రమేష్ చంద్ జైన్, 1వ వార్డ్ కౌన్సిలర్ బుద్ధ సిద్ధార్థ, గుండా ప్రభాకర్, ముష్కం గంగన్న,కోమాకుల రవి, ఎంబడి వెంకటేష్, మోట పలుకుల సతీష్, సంఘ లచ్చన్న, లకావత్ ఈశ్వర్, అట్లూరి దేవేందర్, గోపతి తిరుపతి, నల్ల ఆనంద్, గౌస్ బాషా, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం రోజున భారత రాష్ట్ర సమితి కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇట్టి విలేకరుల సమావేశంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, బిఆరెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వార్థ రాజకీయ అవసరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేసి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిది అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ కాళీశ్వరం ముక్తీశ్వర స్వామి దయతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రివర్యులు కడిగిన ముత్యంలా వస్తారని, నిజం నిప్పులాంటిది, నిజం అనేది కొంత ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుందని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు. రానున్న రోజుల్లో బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మండల యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ సుకుర్, మాజీ రైతుబంధు అధ్యక్షులు అంకం రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురుగు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెల్లా లక్ష్మణ్, హిమ్మత్రావ్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి మల్లయ్య , యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్, నేరెళ్ల రాజయ్య, రామంచ లక్ష్మణ్, మోహన్, గణేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.3
- మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీ హనుమాన్ హిందూ సమ్మేళనం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, యువత పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యత సందేశాలతో నిండి సాగింది. ప్రారంభంలో హనుమాన్ స్వామి ఆశీర్వాదాలతో ప్రారంభమైంది.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.3
- బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.1
- జన్నారం మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం 4 జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జన్నారం మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు ఇరువైపులా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ప్రతి వర్షాకాలంలో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మళ్లీ కష్టాలు తప్పవని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలోపు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1