Shuru
Apke Nagar Ki App…
అడవిలో పెద్దపులి జన్నారం మండలంలోని అభయారణ్యంలో పెద్దపులి సంచారం రేపుతోంది. మండలంలోని ఇందన్పల్లి గ్రామ శివారులో ఉన్న గుట్ట సమీపంలోని మామిడి తోటలో గత నెల పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. తాజాగా మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అటవీ ప్రాంతాలలో పెద్దపులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఆ రెండు పులులు ఒక్కటేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ పులి జత కోసం అటవీ ప్రాంతంలో తిరుగుతోందని అటవీ అధికారులు తెలిపారు.
Gourinatha p.g
అడవిలో పెద్దపులి జన్నారం మండలంలోని అభయారణ్యంలో పెద్దపులి సంచారం రేపుతోంది. మండలంలోని ఇందన్పల్లి గ్రామ శివారులో ఉన్న గుట్ట సమీపంలోని మామిడి తోటలో గత నెల పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. తాజాగా మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అటవీ ప్రాంతాలలో పెద్దపులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఆ రెండు పులులు ఒక్కటేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఆ పులి జత కోసం అటవీ ప్రాంతంలో తిరుగుతోందని అటవీ అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని వారి ఇంటి ఆవరణలో మొక్క నాటిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సతీమణి సుంకే దీవెన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.1
- *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2