logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

1 day ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 day ago

ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు. అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    1
    లోకేష్‌లా డొనేషన్ కాదు.. కష్టపడి డాక్టరయ్యాడు: వైఎస్ జగన్
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై జరుగుతున్న ప్రచారం రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థ్ధాయిలో ధ్వజమెత్తారు.
అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ సాధించారని, నారా లోకేష్ లాగా డొనేషన్లు కట్టి స్టాన్‌ఫోర్డ్‌లో సీట్లు తెచ్చుకోలేదని, కేవలం తన సొంత కష్టంతోనే ఎదిగి డాక్టర్ అయ్యారని ఆయన కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కెరీర్‌ను నాశనం చేయాలనే కుట్రతోనే, ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు వస్తోందని, ఆయన అసలు అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్ మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    1
    మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువులో నీరు నింపాలని స్థానికుల డిమాండ్

మల్కాజిగిరి పరిధిలోని ఆర్కేపురం చెరువును గత ఏడున్నర నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఖాళీగా ఉంచారు. ఇప్పటివరకు చెరువులో కలుపు మొక్కలు తొలగించి, నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టకపోవడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది నీటి ఎద్దడి ప్రారంభమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు చెరువును శుభ్రపరచి నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడి నీటి సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా? అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు – హరీష్ రావు
    1
    ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: మాజీ మంత్రి హరీష్ రావు
ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదని చెప్పి, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు
విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు
నువ్వు అంత గొప్పగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటున్నావా?
అది చెప్పాల్సింది ప్రజలు, నీకు నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి
ఇప్పటి వరకు స్కూళ్లలో చాక్ పీసులకు కూడా డబ్బులు లేవు
– హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    23 hrs ago
  • దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి* ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని తండాలు గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు
    1
    దళితులు బీసీలు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై కలెక్టర్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి*
ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఏంటనీ, గిరిజన రైతులను పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే భూములు వస్తాయని ప్రోత్సహించింది ఫారెస్ట్ అధికారులేనని దాన్ని ప్రశ్నించిన సిపిఎం నాయకులపై విధులకు ఆటంకం కలిగించారనడం 
హాస్యాస్పదంగా ఉందన్నారు
జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బీదర్ రైతులకు సంబంధించి భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు వారి శత్రువులుగా చూడడం మానుకోవాలని అన్నారు ఈ పోటు భూముల సమస్య జిల్లా మొత్తం ప్రధానంగా ఫారెస్ట్ ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు 
జిల్లా రెవిన్యూ అధికారులు వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులకు  భవనాలకు ఇచ్చిన స్థలాలను స్వాధిపరుచుకోవాలని డిమాండ్ చేశారు
రాజంపేట , మాచారెడ్డి ,గాంధారి, లింగంపేట్, మండలాలలోని  తండాలు గ్రామాలలో  ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం ఫారెస్ట్ అధికారులు వేయకుండా అడ్డుకున్నారని, ఇందిరమ్మ ఇండ్లను సైతం ఇవ్వకుండా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి సంపదను కలపను అమ్ముకుంటూ ఈ వ్యాపారానికి అడ్డుగా గిరిజనులు రైతులు పొట్టకూటికోసం అడవి లో ఉండే మర్రి పండ్లు వీటికోసం తరచూ వెళుతున్న గిరిజనులు అడ్డుగా ఉన్నారని వారిపై అక్రమ కేసులు పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని  అన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చు కోవాలని అన్నారు లేదా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు ముదాం అరుణ్ పాల్గొన్నారు
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ...
భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య
పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు
పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    42 min ago
  • జలకళతో మెరిసిన ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు.. ప్రకృతి అందాలకు సందర్శకుల వెల్లువ మెదక్ జిల్లాలోని ఘణపురం ఆనకట్ట వద్ద ఉన్న ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు వరుస వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారిన జలాశయం, చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అందాలను ఆస్వాదించేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    జలకళతో మెరిసిన ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు.. ప్రకృతి అందాలకు సందర్శకుల వెల్లువ
మెదక్ జిల్లాలోని ఘణపురం ఆనకట్ట వద్ద ఉన్న ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు వరుస వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు ద్వారా నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారిన జలాశయం, చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అందాలను ఆస్వాదించేందుకు భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
    1
    ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్
విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిసిల్ల పెద్ద బజార్‌లో కూలిన భారీ వృక్షం.. మినీ వ్యాన్‌పై పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రద్దీగా ఉండే పెద్ద బజార్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ భారీ వృక్షం అకస్మాత్తుగా నేలకూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మినీ వ్యాన్‌పై చెట్టు పడడంతో, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన అరుకుటి రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
    1
    సిరిసిల్ల పెద్ద బజార్‌లో కూలిన భారీ వృక్షం.. మినీ వ్యాన్‌పై పడడంతో ఒకరికి తీవ్ర గాయాలు

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రద్దీగా ఉండే పెద్ద బజార్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ భారీ వృక్షం అకస్మాత్తుగా నేలకూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మినీ వ్యాన్‌పై చెట్టు పడడంతో, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన అరుకుటి రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా రోడ్డుపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.