logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రహ్మ కుమారీస్ వారి రక్షా బంధన్ వేడుకలు..! బొబ్బిలి పట్టణ సీఐ - నారాయణరావుకు రాఖీ కట్టిన రాజేశ్వరి అక్కయ్య..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, రాజయోగిని రాజేశ్వరి అక్కయ్య బొబ్బిలి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నారాయణ రావు కి పవిత్ర రాఖీను కట్టి శుభా కాంక్షలు తెలియచేస్తూ, అంత మందిని వసుదైక కుటుంబం గా భావిస్తూ సోదరి, సోదర, భావాలు తో ఉండాలని, అలాగే స్వర్ణ భారత్ నిర్మాణానికి కృషి చేస్తూ, సత్యం, ధర్మం, ప్రేమ, తో జీవితాలను సుఖ సంతోష ఆనందం తో ఉండేలా సాధన చేయాలని, ఈశ్వరీయ చిత్రాన్ని బహుకరించి శుభాశీస్సులు తెలియజేశారు.

1 hr ago
user_బొబ్బిలి గణేష్
బొబ్బిలి గణేష్
Local News Reporter బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
cedb3a83-b776-4ea9-8438-27d90bc6039d
e9a39e8f-fd7b-4746-a583-6961d219635f
9abed3a6-abd4-4fa5-8816-bbd85b272595
23f21dc6-6ee8-433a-a824-5ee57af59d5e

బ్రహ్మ కుమారీస్ వారి రక్షా బంధన్ వేడుకలు..! బొబ్బిలి పట్టణ సీఐ - నారాయణరావుకు రాఖీ కట్టిన రాజేశ్వరి అక్కయ్య..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, రాజయోగిని రాజేశ్వరి అక్కయ్య బొబ్బిలి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నారాయణ రావు కి పవిత్ర రాఖీను కట్టి శుభా కాంక్షలు తెలియచేస్తూ, అంత మందిని వసుదైక కుటుంబం గా భావిస్తూ సోదరి, సోదర, భావాలు తో ఉండాలని, అలాగే స్వర్ణ భారత్ నిర్మాణానికి కృషి చేస్తూ, సత్యం, ధర్మం, ప్రేమ, తో జీవితాలను సుఖ సంతోష ఆనందం తో ఉండేలా సాధన చేయాలని, ఈశ్వరీయ చిత్రాన్ని బహుకరించి శుభాశీస్సులు తెలియజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.
    1
    కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ 
శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 II గాజువాక II విశాఖపట్నం శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం
    1
    శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట  2026 II గాజువాక II విశాఖపట్నం 
శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం
    user_Krishna Kasturi
    Krishna Kasturi
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
    3
    కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం.
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.
    1
    రామవరంలో  ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్
అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
    3
    *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు*

* స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు
* వేగవంతంగా నిర్మాణ పనులు
మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి
విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
గురువారం విరాళం అందించిన దాత 
హైద్రాబాద్ వాస్తవ్యులు
శ్రీ ఏ ఆశిష్  1 లక్ష 
ముమ్మిడివరం వాస్తవ్యులు 
శ్రీ తాడి వెంకట రెడ్డి
రూ 1 లక్ష 116
విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు.
ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో
శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు.
శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.
    user_Ravi Sharma Nagabhatla
    Ravi Sharma Nagabhatla
    Hindu temple ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు
*హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*
- జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు*
రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం  జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం కొత్తపేట లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ లో స్థానికులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత మెయిన్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ కు చేరుకుని స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడివారితో కలసి భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరుకుతుందని, ప్రతీ రోజు నాణ్యతలో, రుచిలో రాజీ పడరని స్థానికులు రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు బదులివ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పప్పు, పెరుగు, రసం అన్నింటినీ రుచి చూస్తూ అక్కడి వారి తో కలసి ఇష్టంగా మధ్యాహ్న భోజనాన్ని చేశారు. కేంద్రమంత్రి నిరాడంబర జీవన శైలికి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.
    1
    అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం కొత్తపేట లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి.. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ లో స్థానికులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత మెయిన్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ కు చేరుకుని స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేట్ పట్టుకుని భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడివారితో కలసి భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఐదు రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరుకుతుందని, ప్రతీ రోజు నాణ్యతలో, రుచిలో రాజీ పడరని స్థానికులు రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు బదులివ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పప్పు, పెరుగు, రసం అన్నింటినీ రుచి చూస్తూ అక్కడి వారి తో కలసి ఇష్టంగా మధ్యాహ్న భోజనాన్ని చేశారు. కేంద్రమంత్రి నిరాడంబర జీవన శైలికి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.
    1
    కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు 
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని  తెలిపారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    1
    నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు*
కాఠ్మాండు,  నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు.
వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం
వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది.
*గల్లంతైన వారిలో భారతీయులు* 
నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు.
*కొనసాగుతున్న సహాయక చర్యలు* 
గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.