logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం ఏర్పాటు: ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజి రెడ్డి రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యాన వర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో టోన్ టెక్నాలజీని పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత కోత అనంతరం విలువల జోడింపు వరకు స్టార్ట్ అప్పుల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్, హార్టికల్చర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Ashok Kumar Potta
Ashok Kumar Potta
Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago
8be1068e-915b-4f71-8888-c890a6244d80

ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం ఏర్పాటు: ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజి రెడ్డి రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యాన వర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో టోన్ టెక్నాలజీని పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత కోత అనంతరం విలువల జోడింపు వరకు స్టార్ట్ అప్పుల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ భగవాన్, హార్టికల్చర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    20 min ago
  • Post by Narasimulu Narasimulu
    1
    Post by Narasimulu Narasimulu
    user_Narasimulu Narasimulu
    Narasimulu Narasimulu
    మనోహరాబాద్, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    1
    శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.
    1
    ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన  కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    21 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్‌ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్‌ఎస్‌యూ నుండి ఆర్‌ఎస్‌ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    49 min ago
  • వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
    1
    వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి  శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు
జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు
వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    53 min ago
  • మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు
    1
    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్  పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 11 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట: విద్యతో పాటు శాస్త్ర సాంకేతికతపై అవగాహన పెంపొందించుకొని సమాజం పట్ల గౌరవంతో ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు సాగాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నాటకాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    24 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.