SIR ఓట్ల తగ్గింపుపై సీపీఎం ఆందోళన.. వలస ఆదివాసీల ఓట్లను పునఃపరిశీలించాలి... బూర్గంపాడు: మండల వ్యాప్తంగా SIR సర్వే పూర్తయిన నేపథ్యంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. BLAలు సర్వేలో గుర్తించిన ఓటర్ల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఓటర్లు పెద్దగా స్పందించలేదని తెలిపారు. సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాళ్లగుమ్మూరు, కోయగూడెం పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు ప్రాంతాలు, వార్డుల్లో ఉన్నాయని, ఒకే వార్డులో కుటుంబ ఓట్లు ఉండేలా సరిచేయాలని కోరారు. ఓట్లు నమోదు కాని అర్హులను గుర్తించి చేర్చాలని, సంబంధిత వారికి నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలంలో గతంలో 50,351 ఓట్లు ఉండగా SIR అనంతరం 40,568కి తగ్గాయని, 9,783 ఓట్లు తగ్గినట్లు సీపీఎం నాయకులు పేర్కొన్నారు. సారపాక పరిధిలో భారీగా ఓట్లు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వలస వచ్చిన ఆదివాసీ గిరిజనుల ఓట్లను మరోసారి పరిశీలించి అర్హులైన వారిని వెంటనే ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
SIR ఓట్ల తగ్గింపుపై సీపీఎం ఆందోళన.. వలస ఆదివాసీల ఓట్లను పునఃపరిశీలించాలి... బూర్గంపాడు: మండల వ్యాప్తంగా SIR సర్వే పూర్తయిన నేపథ్యంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. BLAలు సర్వేలో గుర్తించిన ఓటర్ల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఓటర్లు పెద్దగా స్పందించలేదని తెలిపారు. సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాళ్లగుమ్మూరు, కోయగూడెం పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు ప్రాంతాలు, వార్డుల్లో ఉన్నాయని, ఒకే వార్డులో కుటుంబ ఓట్లు ఉండేలా సరిచేయాలని కోరారు. ఓట్లు నమోదు కాని అర్హులను గుర్తించి చేర్చాలని, సంబంధిత వారికి నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలంలో గతంలో 50,351 ఓట్లు ఉండగా SIR అనంతరం 40,568కి తగ్గాయని, 9,783 ఓట్లు తగ్గినట్లు సీపీఎం నాయకులు పేర్కొన్నారు. సారపాక పరిధిలో భారీగా ఓట్లు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వలస వచ్చిన ఆదివాసీ గిరిజనుల ఓట్లను మరోసారి పరిశీలించి అర్హులైన వారిని వెంటనే ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
- *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- మున్నేరు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు ను పట్టుకున్న ముదిగొండ ఎస్సై హరిత సిబ్బంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సై హరిత తన సిబ్బందితో పాటు 5 గంటల సమయంలో మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లను వివి కృష్ణాపురం సమీపంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదయం ఏడు గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలోనే ఐదు ఇసుక ట్రాక్టర్లను మొత్తం 17 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను ఓనరులను మీద కేసులు నమోదు చేసినట్లు ఇసుక ట్రాక్టర్లు పెద్దమండవ గంధసిరికి చెందినవిగా గుర్తించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు చేసి ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై హరిత, పిసిలు లక్ష్మణ్, శ్రీను,వెంకట్, కృష్ణ, రాజులు పాల్గొన్నారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1
- *నేపాల్‌లో వరద బీభత్సం..* *వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..* : నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.. ఆ వీడియోలో.. పర్యాటకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వరద నీరు వారి వైపు దూసుకువచ్చింది.. దీంతో భయపడిపోయిన పర్యాటకులు కొండ మీదకు పరుగులు తీయటం మొదలెట్టారు. అయితే, కొంతమంది పర్యాటకులు వరద నుంచి తప్పించుకోలేకపోయారు.. వరద నీరు వారిని ముంచెత్తింది. పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు.. కొంతమంది కొండ మీదకు సగం ఎక్కి ఆగిపోయారు.. వరద నీరు తమ వరకు రాదని వారు భావించారు.. ఊహించని విధంగా వరద నీటిలో వారు కూడా కొట్టుకుపోయారు.. కొండపై వరకు ఎక్కిన వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. గల్లంతయిన వారు ప్రాణాలతో ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నా’..‘ అయ్యో పాపం. నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు......1