Shuru
Apke Nagar Ki App…
ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో జనగణన సర్వేను సూపర్వైజర్లు, సిబ్బంది పక్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సిబ్బంది చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లు ప్రతిరోజు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన గణన సూపర్వైజర్లు పాల్గొన్నారు.
P.G. Murthy
ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో జనగణన సర్వేను సూపర్వైజర్లు, సిబ్బంది పక్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సిబ్బంది చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లు ప్రతిరోజు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన గణన సూపర్వైజర్లు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.2
- బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… గత మూడు రోజులుగా ఘటనపై ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. “రక్షకుడే భక్షకుడు అయ్యాడు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పోక్సో చట్టం ప్రకారం 24 గంటల్లోనే అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారి విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు..బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని, బాలికకు పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకులు ఈ ఘటనపై స్పందించి ఆ చిన్నారికి న్యాయం జరిగేలా ముందుకు రావాలని కోరారు..మహిళల భద్రతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు…1
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్‌కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1
- రోడ్డెక్కిన రైతన్న ఉధృతంగా మారిన ధర్నా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నిజామాబాద్ జిల్లాలో భగ్గుమన్న రైతులు నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ప్రభుత్వ తీరుపై అన్నదాతల ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు రోడ్డెక్కారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 63పై రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.మండూటి ఎండను కూడా లెక్కచేయకుండా రైతులు చేపట్టిన ఈ నిరసనలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు: గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటాల్‌కు 41.5 కిలోల చొప్పున తూకం వేసేవారని, కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లు 45 కిలోలు కావాలని రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తరలించడానికి గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోందని, లారీల సంఖ్య తక్కువగా ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. ఎర్రటి ఎండలో అన్నదాతలు ఆకలితో రోడ్ల మీద కూర్చోవాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. గన్నీ బ్యాగులు, లారీల సంఖ్యను తక్షణమే పెంచాలి. గతంలో మాదిరిగానే 41.5 కిలోల తూకాన్నే అమలు చేయాలి, మిల్లర్ల అక్రమాలను అరికట్టాలి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.1