logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెరుగైన పరిపాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్న నాయుడు కోటబొమ్మాలి : ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పునరుద్ధరణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.54 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల ద్వారా కార్యాలయ భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు లేకుండా సేవలు పొందేలా భవనాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, అధికారులు, తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Karri Sankara Reddy
Karri Sankara Reddy
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
efd93b87-d781-4b8e-8de4-65672076b2b5

మెరుగైన పరిపాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్న నాయుడు కోటబొమ్మాలి : ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం పునరుద్ధరణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.54 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల ద్వారా కార్యాలయ భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు లేకుండా సేవలు పొందేలా భవనాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, అధికారులు, తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
    4
    జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు.
శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం,
సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో  ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ   నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.
    2
    పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    1
    హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం
    1
    ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం 
పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం
    user_KORRA LOKIRAM
    KORRA LOKIRAM
    Farmer డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అరకు వెలి మండలంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రెండు వారాలుగా గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం నుంచే గ్యాస్ కోసం ప్రజలు కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
    1
    అరకు వెలి మండలంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రెండు వారాలుగా గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం నుంచే గ్యాస్ కోసం ప్రజలు కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    1
    అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
    1
    రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత
రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వెంకటాపురంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. పాల్గొన్న పోటీలకు మూమెంట్ నగదు బహుమతి బహుకరణ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం టెక్కలి నియోజకవర్గం లో వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కబడ్డీ జట్టు ఆదివారంనాడు తలపడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటో తో పాటు నగదు బొమ్మలు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొత్తంగా 18 టీంలు జిల్లాస్థాయిలో ఆడడానికి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామ దేవత ఉత్సవాలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలిపారు వచ్చిన వారందరికీ ఎలాంటి అవాంఛనీ సంగతులు లేకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.
    3
    వెంకటాపురంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. పాల్గొన్న పోటీలకు మూమెంట్ నగదు బహుమతి బహుకరణ.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం టెక్కలి నియోజకవర్గం లో వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కబడ్డీ జట్టు ఆదివారంనాడు తలపడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటో తో పాటు నగదు బొమ్మలు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొత్తంగా 18 టీంలు జిల్లాస్థాయిలో ఆడడానికి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామ దేవత ఉత్సవాలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలిపారు వచ్చిన వారందరికీ ఎలాంటి అవాంఛనీ సంగతులు లేకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.