Shuru
Apke Nagar Ki App…
అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Zakeer
అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది1
- ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం 11 మంది లబ్ధిదారులకు రూ.10.70 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.2
- 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- వెలుగొండ ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు ట్రాక్టర్స్ ర్యాలీ వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం పట్టణ కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయబోతున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యాడ్ నుండి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేసి, నల్గొండ ప్రాజెక్టు జలాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కూటమిన్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- స్వచ్ఛ్ మిర్యాలగూడ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు రూపొందించిన ‘స్వచ్ఛ మిర్యాలగూడ' యాప్ లోగోను ఆయన ఆవిష్కరించారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు ఆన్‌లైన్ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సెప్టెంబర్ 1నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మాట్లాడుతూ..కార్మికుల గైర్హాజరును అరికట్టేందుకు,రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్ ద్వారా హాజరు సేకరించనున్నట్లు తెలిపారు.అలాగే,ప్రజలు తమ పరిధిలోని పారిశుధ్య సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు యాప్‌ను వినియోగించుకోవాలన్నారు.అందులో ఫిర్యాదు చేయగానే టికెట్ జనరేట్ అయి సమస్య వెంటనే పరిష్కారమవుతుందని వివరించారు.మరో నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో మనుగడలోకి వస్తుందన్నారు.1