కామారెడ్డి పట్టణం : 6 గ్యారంటీ అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ కామారెడ్డి: BJP Protest Kamareddy | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Kamareddy Municipal Office) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. BJP Protest Kamareddy | అమలు కాని హామీలు ఇచ్చి.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అలవికాని హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయలేదన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి ఇళ్లు ఇవ్వాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ఏమైందని ప్రశ్నించారు. 42శాతం ఇస్తామని చెప్పి 32శాతమే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు.

- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1
- Ugadhi subhakankshalu1
- Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.1
- Post by KR NEWS 3691
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1