logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జల్ జీవన్ మిషన్ కుళాయిల పరిశీలన....................... అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిని పరిశీలించారు. గ్రామస్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిల కనెక్షన్‌ల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు.

on 14 March
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
on 14 March

జల్ జీవన్ మిషన్ కుళాయిల పరిశీలన....................... అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిని పరిశీలించారు. గ్రామస్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిల కనెక్షన్‌ల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.​వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ​ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ​ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. ​అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ​ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
    1
    పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.​వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ​ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ​ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. ​అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ​ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    5 hrs ago
  • దళిత, నిమ్నకులాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంభేడ్కర్ అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఆయన 135.వ.జయంతి సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన శిలావిగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నేటికి ఏనాటికైనా ఆయన రచించిన రాజ్యాంగం శిలా శాసనమని అన్నారు. ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.
    8
    దళిత, నిమ్నకులాలు ఆశాజ్యోతి 
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంభేడ్కర్ అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఆయన 135.వ.జయంతి సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన శిలావిగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నేటికి ఏనాటికైనా ఆయన రచించిన రాజ్యాంగం శిలా శాసనమని అన్నారు. ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నివాసం ఉంటున్న దేవి పాపా వింత అనారోగ్యంతో బాధపడుతుంది పుట్టిన్నుంచి వెన్నెముక వంకరగా నడవడానికి ఇబ్బంది పడుతూ రోజురోజుకు నరకయాతన అనుభవిస్తుంది. నిటారుగా నిలవలేని పరిస్థితి ఏర్పడింది వైద్య చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనస్థితిలో ఉండి తమ తల్లి కూతుర్ని కాపాడుకోవాలని అందరిని ప్రాధేయ పడుతోంది.
    1
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నివాసం ఉంటున్న దేవి పాపా వింత అనారోగ్యంతో బాధపడుతుంది పుట్టిన్నుంచి వెన్నెముక వంకరగా నడవడానికి ఇబ్బంది పడుతూ రోజురోజుకు నరకయాతన అనుభవిస్తుంది. నిటారుగా నిలవలేని పరిస్థితి ఏర్పడింది వైద్య చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనస్థితిలో ఉండి తమ తల్లి కూతుర్ని కాపాడుకోవాలని అందరిని ప్రాధేయ పడుతోంది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice
    1
    భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది.
#AmbedkarJayanti
#StatueOfSocialJustice
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
    1
    నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ 
*నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.*
పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
    user_Sidanivenugopal
    Sidanivenugopal
    Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్‌ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్‌ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    6 hrs ago
  • ఆపత్కాలంలో కాపాడేవారు అగ్నిమాపక కేంద్రం సిబ్బందని మండలపరిషత్ అభివృద్ధిఅధికారి కుప్పిలి ఫణీంద్ర కుమార్ పేర్కొన్నారు.మంగళవారం కోటబొమ్మాళి అగ్నిమాపకకేంద్రంలో జాతీయఅగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం తెలుసుకున్న వెంటనే వెళ్లి మంటలను అదుపుచేసి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండాకాపాడుతున్నారని అన్నారు.వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.
    7
    ఆపత్కాలంలో కాపాడేవారు అగ్నిమాపక కేంద్రం సిబ్బందని మండలపరిషత్ అభివృద్ధిఅధికారి కుప్పిలి ఫణీంద్ర కుమార్ పేర్కొన్నారు.మంగళవారం కోటబొమ్మాళి అగ్నిమాపకకేంద్రంలో జాతీయఅగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం తెలుసుకున్న వెంటనే వెళ్లి మంటలను అదుపుచేసి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండాకాపాడుతున్నారని అన్నారు.వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీకాకుళంజిల్లా రామచంద్రాపురం లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యేకూనరవికుమార్.ఆముదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పమాలలు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు.అంబేద్కర్ చూపిన మార్గంలోనే నేటి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి వర్గానికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళంజిల్లా రామచంద్రాపురం లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యేకూనరవికుమార్.ఆముదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం పంచాయతీలో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్  కూన రవికుమార్  
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పమాలలు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు.అంబేద్కర్ చూపిన మార్గంలోనే నేటి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రతి వర్గానికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.