సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- నందిపేట్ : డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన-ఉచిత వైద్య శిభిరం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా నందిపేట్ రాజానగర్ దుర్గాదేవీ ఆలయం వద్ద మండల వైద్యాధికారి డా. స్వాతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. BP, షుగర్, మలేరియా, డెంగ్యూ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందించారు. వర్షాకాల వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, కార్యదర్శి మహేంద్రతో కలిసి మురికి కాల్వలు పరిశీలించి, టెమోఫోస్ స్ప్రే, ఫాగింగ్, క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. HEO భాస్కర్, PHN పద్మావతి, ANMలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.1
- ఎన్నికల సమరానికి టీఆర్పీ సై.. తొలి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన! రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గానికి పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనగామ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.1
- పెనుగంగా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ADB: జిల్లా సరిహద్దులో పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో డొల్లారా వద్ద వరద ఉధృతిని MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. అక్కడ చేపడుతున్న రక్షణ చర్యల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని గమనిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను MLA పాయల్ శంకర్ ఆదేశించారు.1
- ఆదిలాబాద్: కోతకు గురైన పొచ్చర వంతెన.. రాకపోకలకు ఇబ్బంది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర వాగు వద్ద గల వంతెన కోతకు గురైంది. ఈ రోడ్డు మార్గం గుండా అనునిత్యం కప్పర్ల, బండల్ నాగపూర్ జామిడీ గ్రామాలకు చెందిన వాహనదారులు రాకపోకలను కొనసాగిస్తారు. వంతెన వద్ద పూర్తిగా గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.1
- *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..* *వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జులై 31 :- *మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.* *బోథ్ సిఐ డి గురుస్వామి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు. ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1