సర్వర్ మొరాయింపు.. రేషన్ బియ్యం కోసం ఇరవెండి గ్రామస్తుల పడిగాపులు ఇరవెండి, బూర్గంపహాడ్, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సర్వర్ సమస్యతో ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీకి గడువు ఉందని తెలియడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సర్వర్ పనిచేయక రేషన్ షాపు వద్ద లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. విషయం తెలుసుకున్న ఇరవెండి సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు వెంటనే బూర్గంపహాడ్ డిప్యూటీ తహసీల్దార్‌ను గ్రామానికి పిలిపించి రేషన్ షాపు వద్ద నెలకొన్న పరిస్థితిని వివరించారు. సర్వర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, రేషన్ బియ్యం పంపిణీ గడువును పొడిగించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందే వరకు పంపిణీ కొనసాగించాలని సర్పంచ్, ఉప సర్పంచ్‌లు అధికారులను కోరారు.
సర్వర్ మొరాయింపు.. రేషన్ బియ్యం కోసం ఇరవెండి గ్రామస్తుల పడిగాపులు ఇరవెండి, బూర్గంపహాడ్, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సర్వర్ సమస్యతో ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీకి గడువు ఉందని తెలియడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సర్వర్ పనిచేయక రేషన్ షాపు వద్ద లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. విషయం తెలుసుకున్న ఇరవెండి సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు వెంటనే బూర్గంపహాడ్ డిప్యూటీ తహసీల్దార్‌ను గ్రామానికి పిలిపించి రేషన్ షాపు వద్ద నెలకొన్న పరిస్థితిని వివరించారు. సర్వర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, రేషన్ బియ్యం పంపిణీ గడువును పొడిగించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందే వరకు పంపిణీ కొనసాగించాలని సర్పంచ్, ఉప సర్పంచ్‌లు అధికారులను కోరారు.
- సారపాకలో లారీ ఢీ.. ట్రాక్టర్ డ్రైవర్‌కు త్రివ గాయాలు... సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ వద్ద లారీ, ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నూతన బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్రిడ్జి ఎంట్రన్స్ వద్ద మట్టి, ఇసుక పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే మట్టి, ఇసుకను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మార్గాన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు.3
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- కొత్త బస్సులు ఎప్పుడు వేస్తారు..సీఎం రేవంత్ ను కోరిన బాలుడు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో బస్సు కిందికి కుంగిపోయిందని ప్రయాణికులు ఆరోపించారు కొత్త బస్సులు ఇస్తారా? లేదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఓ బాలుడు ప్రశ్నించారు. ఈ సమస్యలను పట్టించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రయాణికులు కోరారు.1
- పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.1
- వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.1
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1