logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. త్వరలోనే మల్లంపల్లి మండల పోలీస్ స్టేషన్ ఏర్పాటు. మంత్రి దనసరి అనసూయ సీతక్క. మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని, ములుగు జిల్లా ప్రత్యేక చొరవతో అభివృద్ధి లో ముందుకు సాగాలని, త్వరలోనే మండల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉపాధి హామీ పథకం పది లక్షల రూపాయల నిధులతో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి, సి ఆర్ ఆర్ 72.50 లక్షల రూపాల నిధులతో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఉపాధి హామీ పథకం 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., శ్రీనగర్ సర్పంచ్ మల్లేష్ యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడగానే మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. నూతన మల్లంపల్లి మండల కేంద్రం లో మండల సమైక్య భవనాలు రెండు నిర్మిస్తున్నామని, పరిపాలన సౌలభ్యం కోసం ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను ఒకే చోట మండల సముదాయ భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని అంగడి స్థలాన్ని మాస్టర్ ప్లాన్ తో ప్రజల అవసరాల కోసం అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పోలీస్ స్టేషన్ మరియు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా గ్రామసభల ద్వారా దరఖాస్తులను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సంఘంలోని సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 5 లక్షలు రూపాయలు అందించే విధంగా 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'అక్షరమాల' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 7 లక్షల మంది మహిళలు చదువుకోవడం గర్వకారణమని, ములుగు జిల్లా నుంచి పరీక్ష రాసిన మహిళలను అభినందించారు. ఈ నెల 14న ఫలితాలు రాగానే ఉత్తీర్ణులైన వారిని సత్కరించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 18 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. సిఆర్ఆర్, ఎంఆర్ నిధులతో జిల్లాలో 60 నుండి 70 శాతం మేర రోడ్ల పనులు పూర్తయ్యాయని, జిల్లాలో 40 వీఓ భవనాలు, కొత్తగా మంజూరు అయినా గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో నీటి వనరుల వినియోగం కోసం వాగులపై చెక్ డాం నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ, శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు, యం పి ఓ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
23 hrs ago
a39462fe-e9e0-44f4-9be0-805e8e9a2008

మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. త్వరలోనే మల్లంపల్లి మండల పోలీస్ స్టేషన్ ఏర్పాటు. మంత్రి దనసరి అనసూయ సీతక్క. మల్లంపల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని, ములుగు జిల్లా ప్రత్యేక చొరవతో అభివృద్ధి లో ముందుకు సాగాలని, త్వరలోనే మండల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉపాధి హామీ పథకం పది లక్షల రూపాయల నిధులతో గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి, సి ఆర్ ఆర్ 72.50 లక్షల రూపాల నిధులతో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఉపాధి హామీ పథకం 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., శ్రీనగర్ సర్పంచ్ మల్లేష్

884e1605-a428-4e1b-a1af-f1341282fa36

యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడగానే మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ప్రకటించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. నూతన మల్లంపల్లి మండల కేంద్రం లో మండల సమైక్య భవనాలు రెండు నిర్మిస్తున్నామని, పరిపాలన సౌలభ్యం కోసం ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులను ఒకే చోట మండల సముదాయ భవనం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని అంగడి స్థలాన్ని మాస్టర్ ప్లాన్ తో ప్రజల అవసరాల కోసం అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పోలీస్ స్టేషన్ మరియు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా గ్రామసభల ద్వారా దరఖాస్తులను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా సంఘంలోని సభ్యురాలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 5 లక్షలు రూపాయలు అందించే విధంగా 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 'అక్షరమాల' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 7 లక్షల మంది మహిళలు చదువుకోవడం గర్వకారణమని, ములుగు జిల్లా నుంచి పరీక్ష రాసిన

bdea52a6-1bef-4c41-a636-63c66c38e6df

మహిళలను అభినందించారు. ఈ నెల 14న ఫలితాలు రాగానే ఉత్తీర్ణులైన వారిని సత్కరించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 18 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. సిఆర్ఆర్, ఎంఆర్ నిధులతో జిల్లాలో 60 నుండి 70 శాతం మేర రోడ్ల పనులు పూర్తయ్యాయని, జిల్లాలో 40 వీఓ భవనాలు, కొత్తగా మంజూరు అయినా గ్రామపంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో నీటి వనరుల వినియోగం కోసం వాగులపై చెక్ డాం నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ, శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ సునీత, మండల ప్రత్యేక అధికారి కృపాకర్, సర్పంచ్ శ్యామ్ రావు, యం పి ఓ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు.
అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    53 min ago
  • Post by Motam Rajesh
    2
    Post by Motam Rajesh
    user_Motam Rajesh
    Motam Rajesh
    Grain Importer వెంకటాపురం, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది.
ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణం శోభితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    1
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణం శోభితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    2
    జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
    1
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. 
గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు 
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 min ago
  • వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో మృతి చెందిన స్రవంతి, ఆమె పిల్లల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించగా ఈ ఘటన జరిగింది. భర్త ప్రవీణ్ ఇంటి ముందే మృతదేహాలను పూడ్చేందుకు స్రవంతి బంధువులు గొయ్యి తవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువురు బంధువుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    5
    వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో మృతి చెందిన స్రవంతి, ఆమె పిల్లల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించగా ఈ ఘటన జరిగింది.
భర్త ప్రవీణ్ ఇంటి ముందే మృతదేహాలను పూడ్చేందుకు స్రవంతి బంధువులు గొయ్యి తవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువురు బంధువుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.