Shuru
Apke Nagar Ki App…
కొండగట్టు లో కన్నుల పండువలా హనుమాన్ జయంతి వేడుకలు... భారీగా తరలివచ్చిన భక్తులు.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణం శోభితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
K.V.REDDY
కొండగట్టు లో కన్నుల పండువలా హనుమాన్ జయంతి వేడుకలు... భారీగా తరలివచ్చిన భక్తులు.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణం శోభితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
More news from తెలంగాణ and nearby areas
- పౌర్ణమి రోజున, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. సురేష్ ఆత్మారామ్ ఆద్వర్యంలో 39వ సారి గిరిప్రదక్షిణ కన్నులపండువలా నిర్వహించారు. కొండగట్టు దిగువ ప్రారంభమైన గిరిప్రదక్షిణ రెండున్నర కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగా టెంపుల్ వై జంక్షన్ వరకు అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా లో ఐదు కిలోమీటర్లు సాగింది. సరైన దారి లేకపోయినా రాళ్ళు రప్పల మద్య పది వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి మధ్యలో సీతమ్మ వారి భావి వద్ద భక్తులు పవిత్ర జలాన్ని తలపై చల్లుకున్నారు. ఆ బావి నీళ్ళే నిత్యం ఆంజనేయస్వామి అభిషేకానికి భక్తుల తీర్థానికి వినియోగిస్తారు. రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి” , " జై శ్రీరామ్ " అనే నినాదాలతో కొండగట్టు మార్మోగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇదే రోజు చిన్న హనుమాన్ జయంతి కావడంతో అంజన్న దర్శనానికి స్వాములు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి సందర్భంగా గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దాదాపు ఎనమిదిన్నర కిలోమీటర్లు సాగే గిరిప్రదక్షిణ సాగే దారిలో సౌకర్యాలు కల్పిస్తే అరుణాచలం కంటే అద్భుతమైన గిరి ప్రదక్షిణ కొండగట్టులో చేయవచ్చని భక్తుల అభిప్రాయపడ్డారు.4
- జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.1
- హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.1
- Post by Tagore3
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణం శోభితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.1