logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొండగట్టులో ఘనంగా గిరిప్రదక్షిణ...39వ సారి గిరిప్రదక్షిణ లో పాల్గొన్న పదివేల మంది భక్తులు పౌర్ణమి రోజున, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. సురేష్ ఆత్మారామ్ ఆద్వర్యంలో 39వ సారి గిరిప్రదక్షిణ కన్నులపండువలా నిర్వహించారు.‌ కొండగట్టు దిగువ ప్రారంభమైన గిరిప్రదక్షిణ రెండున్నర కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగా టెంపుల్ వై జంక్షన్ వరకు అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా లో ఐదు కిలోమీటర్లు సాగింది. సరైన దారి లేకపోయినా రాళ్ళు రప్పల మద్య పది వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి మధ్యలో సీతమ్మ వారి భావి వద్ద భక్తులు పవిత్ర జలాన్ని తలపై చల్లుకున్నారు. ఆ బావి నీళ్ళే నిత్యం ఆంజనేయస్వామి అభిషేకానికి భక్తుల తీర్థానికి వినియోగిస్తారు. రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి” , " జై శ్రీరామ్ " అనే నినాదాలతో కొండగట్టు మార్మోగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇదే రోజు చిన్న హనుమాన్ జయంతి కావడంతో అంజన్న దర్శనానికి స్వాములు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి సందర్భంగా గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దాదాపు ఎనమిదిన్నర కిలోమీటర్లు సాగే గిరిప్రదక్షిణ సాగే దారిలో సౌకర్యాలు కల్పిస్తే అరుణాచలం కంటే అద్భుతమైన గిరి ప్రదక్షిణ కొండగట్టులో చేయవచ్చని భక్తుల అభిప్రాయపడ్డారు.‌

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కొండగట్టులో ఘనంగా గిరిప్రదక్షిణ...39వ సారి గిరిప్రదక్షిణ లో పాల్గొన్న పదివేల మంది భక్తులు పౌర్ణమి రోజున, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. సురేష్ ఆత్మారామ్ ఆద్వర్యంలో 39వ సారి గిరిప్రదక్షిణ కన్నులపండువలా నిర్వహించారు.‌ కొండగట్టు దిగువ ప్రారంభమైన గిరిప్రదక్షిణ రెండున్నర కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగా టెంపుల్ వై

జంక్షన్ వరకు అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా లో ఐదు కిలోమీటర్లు సాగింది. సరైన దారి లేకపోయినా రాళ్ళు రప్పల మద్య పది వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. దారి మధ్యలో సీతమ్మ వారి భావి వద్ద భక్తులు పవిత్ర జలాన్ని తలపై చల్లుకున్నారు. ఆ బావి నీళ్ళే నిత్యం ఆంజనేయస్వామి అభిషేకానికి

భక్తుల తీర్థానికి వినియోగిస్తారు. రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి” , " జై శ్రీరామ్ " అనే నినాదాలతో కొండగట్టు మార్మోగింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇదే రోజు చిన్న హనుమాన్ జయంతి కావడంతో అంజన్న దర్శనానికి స్వాములు వివిధ

ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి సందర్భంగా గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దాదాపు ఎనమిదిన్నర కిలోమీటర్లు సాగే గిరిప్రదక్షిణ సాగే దారిలో సౌకర్యాలు కల్పిస్తే అరుణాచలం కంటే అద్భుతమైన గిరి ప్రదక్షిణ కొండగట్టులో చేయవచ్చని భక్తుల అభిప్రాయపడ్డారు.‌

More news from తెలంగాణ and nearby areas
  • రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
    4
    రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు.
మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    2
    జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు భక్తి, భవ్యతల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించబడగా, రాత్రివేళల్లో వెలుగుల కాంతులతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటోంది. మాలవిరమణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ భక్తులు. “జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దొంగలమర్రి ఆర్చ్ నుంచి కొండగట్టు గుట్టపై వరకు గూడ్స్ ఆటోల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా, బొజ్జ పోతన్న నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మీద కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
    1
    హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది.
గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది.
ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది.
గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు.
అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
    4
    భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు.
తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.