Shuru
Apke Nagar Ki App…
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
M D Azizuddin
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.1
- రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.4
- నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.3
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- వరంగల్ జిల్లా:మొక్కజొన్న రైతులను దళారులు దోచుకుంటున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులు మద్దతు ధర కంటే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 తక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పర్వతగిరి మండలం పెద్ద తండాలో రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, మార్కెట్లో దళారుల ఆధిపత్యం కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌పెడ్, నాఫెడ్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1