*జర్నలిజంలో ద్విగుణిత స్వర్ణం సాధించిన తస్లీమ యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెండు స్వర్ణ పతకాలు అందుకున్న ఎస్.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న తస్లీమా సాధన ఆదోని పట్టణానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఒక అమ్మాయి అయి కూడా ఎన్నో రాత్రులు నిద్ర మానుకుని లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని తెలిపారు. ఈ విజయానికి తస్లీమాకు అండగా నిలిచిన తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, క్రమశిక్షణతో కూడిన చదువు యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యంగా మైనారిటీ సమాజంలోని బాలికలు చదువులో ముందుకు రావడానికి తస్లీమా విజయగాథ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో మహిళల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి జర్నలిజం ఒక శక్తివంతమైన వేదిక అని పేర్కొన్న ఆయన, తన కలంతో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని తస్లీమాకు సూచించారు. విద్యతో పాటు సమాజ సేవా భావన కలిగిన జర్నలిస్టుగా ఎదిగి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానికులు తస్లీమాను అభినందిస్తూ ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు బ్రోచర్ విడుదల1