logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపాటు: టెహ్రాన్ విమానాశ్రయంపై బాంబుల వర్షం.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం! ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపాటు: టెహ్రాన్ విమానాశ్రయంపై బాంబుల వర్షం.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం! ఇరాన్ గగనతలంలో ఇజ్రాయెల్ గర్జన.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం? ​టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) శనివారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించింది. ఈ భీకర దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 అత్యాధునిక యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ​​ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) కు చెందిన 'ఖుద్స్ ఫోర్స్' ఈ విమానాశ్రయాన్ని ఆయుధాలు, నగదు మరియు ఇతర యుద్ధ సామాగ్రిని తరలించడానికి ప్రధాన కేంద్రంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. బాంబుల ధాటికి విమానశ్రయం రన్‌వేపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానాశ్రయ పరిసరాల్లో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ​రక్షణ వ్యవస్థకు దెబ్బ: ఈ దాడుల వల్ల ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

on 8 March
user_Jtv9 News Network
Jtv9 News Network
బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
on 8 March

ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపాటు: టెహ్రాన్ విమానాశ్రయంపై బాంబుల వర్షం.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం! ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపాటు: టెహ్రాన్ విమానాశ్రయంపై బాంబుల వర్షం.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం! ఇరాన్ గగనతలంలో ఇజ్రాయెల్ గర్జన.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం? ​టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) శనివారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించింది. ఈ భీకర దాడుల్లో ఇరాన్‌కు చెందిన 16 అత్యాధునిక యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ​​ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) కు చెందిన 'ఖుద్స్ ఫోర్స్' ఈ విమానాశ్రయాన్ని ఆయుధాలు, నగదు మరియు ఇతర యుద్ధ సామాగ్రిని తరలించడానికి ప్రధాన కేంద్రంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. బాంబుల ధాటికి విమానశ్రయం రన్‌వేపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానాశ్రయ పరిసరాల్లో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ​రక్షణ వ్యవస్థకు దెబ్బ: ఈ దాడుల వల్ల ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.
    1
    లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..*
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
మంత్రి మాట్లాడుతూ..
నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష...
లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి...
పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి...
డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన...
అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం...
అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి...
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి...
ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది...
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    20 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :04.04.2026
కామారెడ్డి జిల్లా శనివారం 
రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం
రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం:
గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389
సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369
అని తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్,  చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు   కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    50 min ago
  • ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    1
    ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    4
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో  మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో  కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    1
    గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు.  ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    1 day ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ 
గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు 
గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని 
రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    52 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.