నల్గొండలో సాయి నైజా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
నల్గొండలో సాయి నైజా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..1
- హన్మకొండ జిల్లాలో ఓ ఎంఆర్వోపై భార్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఎంఆర్వో గిరిబాబు ఐదేళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఝాన్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యా పిల్లలను పట్టించుకోకుండా వేరే మహిళతో ఉంటూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.1
- ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.2
- సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. 1
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేటలోని వైద్య కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. గడువు ముగిసిన మందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే వేరు చేసి తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన ఔషధాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆసుపత్రి అధికారి డా. కిషన్, డా. ప్రవీణ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు1
- కరీంనగర్ జిల్లాలో కన్నతండ్రే కవల పిల్లల పట్ల కాలయముడులా మారాడు. ఆడపిల్లలనే అక్కసుతో భార్యతో గొడవ పడి ఇద్దరు కవల పిల్లలకు విషమిచ్చి బావిలో పడేశాడు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రైవేట్ ఉద్యోగం చేసే కచ్చు శ్రీశైలంకు కవల ఆడపిల్లలు జన్మించారు. వారికి గీతాన్ శ్రీ, గీతాన్విక నామకరణం చేశారు. ఇద్దరు ఆడబిడ్డలేనన్న కారణంతో తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. బంధువులు జోక్యం చేసుకుని పలుమార్లు సర్దిచెప్పారు. ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారన్న విషయంపై ఈరోజు ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు. బిడ్డలు ఇద్దరికీ గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. ఏమి ఎరగనట్లు స్థానికులతో కలిసి పిల్లల కోసం వెతికి బావిలో నుంచి వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఒక పాప మృతదేహం లభించగా మరొకరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. చూడ ముచ్చటగా ఉన్న పసి పిల్లలను ప్రాణం తీసిన తండ్రి శ్రీశైలం పై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆడపిల్లలు అనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.4
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు లాలు తండాలో ఎస్సారెస్పీ కాలువ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. తండా వైపు వచ్చే కాలువ గేట్లను కొందరు ఇష్టారాజ్యంగా ఎత్తడం వల్ల నీరు కాలువపై నుంచి కిందికి వచ్చి రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంట పొలాలు నీటమునిగే పరిస్థితి ఏర్పడగా, కాలువ తెగిపోవచ్చనే ప్రమాదం కూడా నెలకొంది. సమస్యపై వెంటనే స్పందించి నీటి విడుదలను నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1