గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే 99 రోజుల ప్రణాళిక పాలన అంటే పేపర్ల మీద కాదు, చేతల్లో చూపించాలి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం :గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని పాలన అంటే పేపర్ల మీద కాదు, చేతల్లో చూపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం గణపురం మండలం చెల్పూర్, లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ప్రజాపాలన అబ్జర్వర్ హుస్సేన్ బాబాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ప్రజాపాలనలో అందుతున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన వీడియోను వీక్షించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో వివరించారు. గ్రామ సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల్లో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, వారి అవసరాలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను చేపట్టారని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సహాయం, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టిందని వివరించారు. రానున్న జూన్ నెల నుండి ఇన్సూరెన్స్ అమలు, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభల ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్య శిబిరాలు, రహదారి భద్రత, సంక్షేమ పథకాల అమలు, డ్రగ్స్ నివారణ, ఉపాధి అవకాశాలు, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాట్లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్ పంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్ గౌడ్ లు పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే 99 రోజుల ప్రణాళిక పాలన అంటే పేపర్ల మీద కాదు, చేతల్లో చూపించాలి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం :గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని పాలన అంటే పేపర్ల మీద కాదు, చేతల్లో చూపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం గణపురం మండలం చెల్పూర్, లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ప్రజాపాలన అబ్జర్వర్ హుస్సేన్ బాబాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి రాష్ట్ర గీతాన్ని
ఆలపించి, ప్రజాపాలనలో అందుతున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన వీడియోను వీక్షించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో వివరించారు. గ్రామ సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 28 నెలల్లో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, వారి అవసరాలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను చేపట్టారని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు
సౌకర్యం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సహాయం, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టిందని వివరించారు. రానున్న జూన్ నెల నుండి ఇన్సూరెన్స్ అమలు, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా
అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభల ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్య శిబిరాలు, రహదారి భద్రత, సంక్షేమ పథకాల అమలు, డ్రగ్స్ నివారణ, ఉపాధి అవకాశాలు, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాట్లను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్ పంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్ గౌడ్ లు పాల్గొన్నారు.
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.1