అల్లూరి జిల్లాలోని డుంబ్రిగూడ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం మండల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పల నరస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనులను అడవుల నుండి గెంటివేయడానికి కుట్ర పన్నుతున్నాయని, కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై ఆదివాసుల అడవులు, భూములు, సహజ వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆదివాసులకు పౌష్టికాహారం అందించకుండా యోగా పేరుతో మోసం చేస్తున్నందున మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లోని చింతపల్లి మండలంలో 1450 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బాక్సైట్, మాంగనీస్, గ్రానైట్, టంగ్‌స్టన్, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు మినరల్స్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం 2024లో అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 2025లో సర్వేకు అనుమతులు మంజూరు చేసిందని అప్పల నరస వివరించారు. క్రిటికల్ మినరల్ రాకర్స్ (సీఎం టీ) కంపెనీ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని, గత రెండు నెలలుగా ఆరు బ్లాకుల్లో రహస్యంగా మట్టి నమూనాలను సేకరిస్తోందని ఆయన తెలిపారు. జీకే వీధి మండలం జర్రేల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా బాక్సైట్ సర్వేలు చేస్తున్న విషయం తెలిసి, ఆ ప్రాంత గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఒక సర్వే బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ రహస్య సర్వేలు అటవీ ప్రాంతాలు, ఆదివాసి గ్రామాలు, సంరక్షిత వన్యప్రాణి నివాసాలను కవర్ చేస్తున్నాయని, గ్రామసభల అనుమతి, సమగ్ర పర్యావరణ అంచనా (ఈఐఏ), సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఐఏ) లేకుండా జరుగుతున్న ఈ సర్వేలు పీసా చట్టం, ఎఫ్‌ఆర్‌ఏ 2006, 1/70 చట్టాలను, రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 1450 చదరపు కిలోమీటర్ల సర్వేకు అనుమతి ఇవ్వడం అన్యాయమని, ఒకవైపు అడవులు పెంచాలని చెబుతూనే మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు అడవులను దారపోస్తున్నారని అప్పల నరస విమర్శించారు. తక్షణమే బాక్సైట్ సర్వే అనుమతులు రద్దు చేయాలని, సీఎంకే సంస్థపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, రహస్య సర్వేలకు అనుమతి ఇచ్చిన జిల్లా అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జర్రేల, జీకే వీధి, చింతపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న రహస్య సర్వేలపై స్వతంత్ర విచారణ జరిపి సర్వే చేస్తున్న వారిని అరెస్టు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు లేదా కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ రహస్య సర్వేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆదివాసి ప్రజల భూములు, అడవులు, వనరులను కార్పొరేట్ లాభాల కోసం ధ్వంసం చేసే ఏ ప్రయత్నాలనైనా ఆదివాసి సమాజం సహించదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి. సూర్యనారాయణ, సురేష్, దొంబుతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అల్లూరి జిల్లాలోని డుంబ్రిగూడ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం మండల జనరల్ బాడీ సమావేశంలో సిపిఎం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పల నరస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనులను అడవుల నుండి గెంటివేయడానికి కుట్ర పన్నుతున్నాయని, కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై ఆదివాసుల అడవులు, భూములు, సహజ వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఆదివాసులకు పౌష్టికాహారం అందించకుండా యోగా పేరుతో మోసం చేస్తున్నందున మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లోని చింతపల్లి మండలంలో 1450 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బాక్సైట్, మాంగనీస్, గ్రానైట్, టంగ్‌స్టన్, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు మినరల్స్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం 2024లో అనుమతి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం 2025లో సర్వేకు అనుమతులు మంజూరు చేసిందని అప్పల నరస వివరించారు. క్రిటికల్ మినరల్ రాకర్స్ (సీఎం టీ) కంపెనీ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని, గత రెండు నెలలుగా ఆరు బ్లాకుల్లో రహస్యంగా మట్టి నమూనాలను సేకరిస్తోందని ఆయన తెలిపారు. జీకే వీధి మండలం జర్రేల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా బాక్సైట్ సర్వేలు చేస్తున్న విషయం తెలిసి, ఆ ప్రాంత గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఒక సర్వే బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారని కూడా ఆయన చెప్పారు. ఈ రహస్య సర్వేలు
అటవీ ప్రాంతాలు, ఆదివాసి గ్రామాలు, సంరక్షిత వన్యప్రాణి నివాసాలను కవర్ చేస్తున్నాయని, గ్రామసభల అనుమతి, సమగ్ర పర్యావరణ అంచనా (ఈఐఏ), సామాజిక ప్రభావ అంచనా (ఎస్ఐఏ) లేకుండా జరుగుతున్న ఈ సర్వేలు పీసా చట్టం, ఎఫ్‌ఆర్‌ఏ 2006, 1/70 చట్టాలను, రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 1450 చదరపు కిలోమీటర్ల సర్వేకు అనుమతి ఇవ్వడం అన్యాయమని, ఒకవైపు అడవులు పెంచాలని చెబుతూనే మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు అడవులను దారపోస్తున్నారని అప్పల నరస విమర్శించారు. తక్షణమే బాక్సైట్ సర్వే అనుమతులు రద్దు చేయాలని, సీఎంకే సంస్థపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, రహస్య సర్వేలకు అనుమతి ఇచ్చిన జిల్లా అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జర్రేల, జీకే వీధి, చింతపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న రహస్య సర్వేలపై స్వతంత్ర విచారణ జరిపి సర్వే చేస్తున్న వారిని అరెస్టు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు లేదా కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ రహస్య సర్వేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆదివాసి ప్రజల భూములు, అడవులు, వనరులను కార్పొరేట్ లాభాల కోసం ధ్వంసం చేసే ఏ ప్రయత్నాలనైనా ఆదివాసి సమాజం సహించదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి. సూర్యనారాయణ, సురేష్, దొంబుతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో దీర్ఘకాలంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు సీఐ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు పరిష్కారం చూపారు. పట్టణంలోని ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించారు. గతంలో గొల్ల అప్పారావు సెంటర్ నుండి రామా థియేటర్ రోడ్డుకు చేరుకోవడానికి కనీసం 30 నిమిషాలకు పైగా సమయం పట్టేదని, అలాగే రెడ్ కాన్వెంట్ వీధిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిష్కారం వల్ల ఆ సమస్యలు తొలగిపోయాయని, దీనితో స్కూలుకు వెళ్లే విద్యార్థులు, కంపెనీలకు వెళ్లే ఉద్యోగస్తులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టిన పోలీసులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ పరిష్కారం నిత్యం కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.1
- పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేవలం ఒకే సామాజిక వర్గం వల్లే గెలిచారంటూ మాజీ ఎంపీ వంగా గీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజల తీర్పును కులాల కోణంలో చూడడం వైసీపీ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కేవలం ఒక కులం వల్ల మాత్రమే కాదని, శెట్టిబలిజ, యాదవ, పద్మశాలి, దళిత, మత్స్యకార మరియు ఇతర అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అపూర్వ మద్దతు అందించారని జగదీష్ స్పష్టం చేశారు. పారదర్శకమైన రాజకీయాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత చూసే ప్రజలు భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్‌ను గెలిపించారని పేర్కొంటూ, నాయకుడిని వారు పుట్టిన ప్రాంతం లేదా కులం ఆధారంగా కాకుండా వారి సేవలు, లక్షణాల ఆధారంగానే ప్రజలు నిర్ణయిస్తారని వంగా గీతకు హితవు పలికారు. జనసేన పార్టీ సిద్ధాంతమే సామాజిక సమైక్యత అని, అన్ని మతాలను, కులాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. అయితే, వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని జగదీష్ ఆరోపించారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి, పవన్ కళ్యాణ్ పై అర్థరహితమైన విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన తీర్పు కులాలకు అతీతమైనదని, దీనిని కుల రాజకీయాలతో ముడిపెట్టి ప్రజల నిర్ణయాన్ని అవమానించవద్దని పెంకే జగదీష్ హెచ్చరించారు. కులాల కుంపటి రాజేయడం వైసీపీకి అలవాటు అని పేర్కొంటూ, పిఠాపురం నియోజకవర్గ తీర్పును కించపరచడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకువస్తున్న వి.బి. రాంజీ కొత్త చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నరసింగపురం గ్రామంలో కూలీలు నిరసన చేపట్టారు. బీకేఎంయూ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాస్, సీపీఐ నాయకులు సాకా రామకృష్ణ నేతృత్వంలో ప్లకార్డులు పట్టుకొని ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, గాంధీ పేరుతో ఉన్న చట్టం ముద్దు, వి.బి. రాంజీ చట్టం వద్దు అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్ల నిధులు కోత విధించడాన్ని, అలాగే మహాత్మా గాంధీ పేరును పథకం నుండి తొలగించేందుకు కుట్రలు చేయడాన్ని కూలీలు తీవ్రంగా ఖండించారు. కూలీలను ఇబ్బంది పెడుతున్న 'ఫేస్ మస్తర్' విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత జాతీయ ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, పనిదినాలను 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలిని రూ. 500 కి పెంచాలని, పని ప్రదేశాలలో తాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పేదల పొట్టకొడితే ఉధృత పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలికి చంటి, పోలేటి వెంకటరెడ్డి, కావిరెడ్డి కన్నారావు, ఆశీర్వాదం, మరియమ్మ, కాసులమ్మ, రాజేశ్వరి సహా పలువురు కూలీలు పాల్గొన్నారు.1
- కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మంగళవారం కాకినాడ నగరంలోని కాస్మోపాలిటన్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని తుమ్మల బాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు, కాపు యువతకు ఉపాధి అవకాశాలు, కాపు కళ్యాణ మండపాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ఏమి చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో కాలం గడపడం వైసీపీ నాయకులకు అలవాటైందని విమర్శించారు. వైసీపీ కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని, అదే రాజకీయ సంస్కృతిని జగన్ కొనసాగిస్తున్నారని తుమ్మల బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కుల రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్, అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య వంటి ఘటనలు జరిగినప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాగే, రామచంద్రపురంలో కాపు సమావేశం నిర్వహించినప్పుడు జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికిన తుమ్మల బాబు, పవన్ కళ్యాణ్‌కి ఒకే కులానికి చెందిన నాయకుడనే ముద్ర వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని తుమ్మల బాబు మండిపడ్డారు. ఈ సమావేశంలో స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కడలి ఈశ్వరి, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, సూపర్ బజార్ చైర్మన్ పెసంగి ఆదినారాయణ, సామర్లకోట మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఈశ్వరరావు, మండల యువత అధ్యక్షులు మలిరెడ్డి బుచ్చిరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పిట్ట జానకిరామారావు, పెంకే వెంకటలక్ష్మి, అట్ల సత్యనారాయణ, నల్లం శ్రీనివాస్ (బుల్లెట్ వాసు), నందమూరి వినోద్, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, ఎంపీటీసీ శివరామకృష్ణ, జనసేన పార్టీ కాకినాడ లీగల్ సెల్ సభ్యురాలు అడ్వకేట్ హేమ పద్మజ, సురవరపు సురేష్, పన్నీరు వెంకటేశ్వరరావు, పన్నీరు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.2
- కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉన్న ఆర్టీఐహెచ్ (RTIH) గ్రామీణ అవుట్‌పోస్ట్ కేంద్రంలో గ్రామీణ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్థానిక భాగస్వాములలో స్వయం ఉపాధి, వ్యవస్థాపకత పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం (REDP) మరియు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం (ESDP) నాలుగో రోజు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో విద్యా, ప్రభుత్వ, స్టార్టప్ రంగాల నుండి వచ్చిన ప్రముఖ నిపుణులు వ్యవస్థాపకత, గ్రామీణ అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై విలువైన అవగాహన కల్పించారు. మొదటి సెషన్‌లో కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన శ్రీ జయకుమార్ “డిజిటల్ పారిశ్రామికత”పై ప్రసంగిస్తూ, డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి గ్రామీణ యువత తమ వ్యాపార అవకాశాలను ఎలా విస్తరించుకోవాలో వివరించారు. రెండవ సెషన్‌లో డాక్టర్ కవల నాగేశ్వరరావు “గ్రామీణ పారిశ్రామికత” అంశంపై మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలను సృజనాత్మక ఆలోచనలు, సామాజిక భాగస్వామ్యం, స్థానిక వనరుల వినియోగం ద్వారా స్థిరమైన వ్యాపార అవకాశాలుగా ఎలా మార్చుకోవాలో తెలియజేశారు. మూడవ సెషన్‌లో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ శివరామ్ ప్రసాద్, గ్రామీణ స్థాయిలో చిన్నతరహా పరిశ్రమలు, మష్రూమ్ సాగు, అలంకరణ చేపల పెంపకం, త్వరలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో ఆర్టీఐహెచ్ రాజమహేంద్రవరం ఇన్‌క్యూబేషన్ హెడ్ శ్రీ కె. చంద్ర ప్రకాశ్, ప్రోగ్రామ్ అసోసియేట్‌లు శ్రీ జి. పాండురంగ, శ్రీ టి. శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ ఆవిష్కర్తలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పరస్పర చర్చలు, ప్రాయోగిక ఉదాహరణలు, కార్యాచరణ ఆధారిత కార్యక్రమాల ద్వారా పాల్గొన్నవారు వ్యవస్థాపకత, వ్యాపార నిర్వహణ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన పొందారని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వినూత్న వ్యాపార అవకాశాల అన్వేషణకు ఈ కార్యక్రమం ప్రేరణగా నిలిచి, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- 😭🙏1
- హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తన 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆసుపత్రి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంలో బసవతారకం ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ, వేలాది మంది క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణతో పాటు వైద్యులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలను అందిస్తూ దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సా కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.1
- 😭🙏1