సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
- సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.1
- పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం? అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.1
- బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా. బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1