చదువు ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. చదువు ద్వారా మాత్రమే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. బుధవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకుల వారి గణపురం ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహంలోని గదులను, వంట శాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులతో వసతి గృహ నిర్వహణ, అధికారుల తీరును, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గదిని పరిశీలిస్తూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సక్రమంగా పనిచేస్తూ విద్యార్థులకు తగిన వెలుతురు అందేలా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. అలాగే డోర్లు, కిటికీలు బాగుండేలా చూసుకోవాలని , మూత్రశాలలు (టాయిలెట్లు) పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించిన ఆయన, భోజనశాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా తరచుగా శుభ్రపరచాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఆహార పదార్థాల నిల్వ, నాణ్యతపై ప్రశ్నలు అడిగి, సరైన విధంగా నిర్వహణ ఉండాలని తెలిపారు. వంటగదిలో తయారవుతున్న భోజనాన్ని పరిశీలించి, ఎలా వండుతున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పట్టికను కూడా పరిశీలించి, వారి ఆరోగ్యం, వసతి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణ పనులను అత్యంత నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించానని గుర్తు చేశారు. పట్టుదలతో చదివితేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి చేరుకోవడమే కాకుండా, మరో పదిమందికి సహాయం చేయగలిగే సామర్థ్యం వస్తుందని తెలిపారు. పాఠశాల ఆవరణలో క్రీడా వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులు ఒకరికొకరు తోడుగా ఉంటూ, చక్కగా చదువుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిడి జనార్ధన్, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Post by JADI RAJU1
- మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.2
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- Post by Solanke Ravi4
- జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.1