మాట ఇచ్చారు… నిలబెట్టుకున్నారు! ఆడబిడ్డ పెళ్లికి ముందే ఆర్థిక భరోసా… పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించిన సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగర రాజకీయాల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ, మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడిగా పేరొందిన కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మరోసారి తన నిబద్ధతను, ప్రజల పట్ల తనకున్న ఆత్మీయతను చాటిచెప్పారు. తన 58వ డివిజన్ కు చెందిన దుర్శెట్టి ప్రసూన–మహేంద్ర చారి దంపతుల పుత్రిక చిలసౌ అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహ మహోత్సవానికి సర్ధార్ రవీందర్ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ముందుగానే కార్యరూపంలోకి తీసుకువచ్చి, ఆడబిడ్డ వివాహానికి రూ.25,000 ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వధూవరులతో ముచ్చటిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, “ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి ఓటు నాకు బాధ్యత. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రతి ప్రజా ప్రతినిధి కర్తవ్యం. ప్రజల కష్టాల్లోనే కాదు… వారి సంతోషాల్లో కూడా భాగస్వామ్యం కావడమే నిజమైన ప్రజా సేవ” అని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని అన్నారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని గుర్తుచేస్తూ, ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట… పెళ్లికి ముందే ఆర్థిక సహాయం… పట్టుచీరతో ఆడబిడ్డకు కానుక… పెళ్లి వేడుకకు స్వయంగా హాజరై ఆశీర్వాదం… ఇలా మాట నుంచి చేతల వరకు తన నిబద్ధతను చూపించారని స్థానికులు ప్రశంసించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఆత్మీయంగా హాజరవుతూ కుటుంబ సభ్యుడిలా పలకరించడం సర్ధార్ రవీందర్ సింగ్ కి ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. *“మాటలు చెప్పే నాయకుడు కాదు… ఇచ్చిన మాటను చేతల్లో చూపించే నాయకుడు”*
మాట ఇచ్చారు… నిలబెట్టుకున్నారు! ఆడబిడ్డ పెళ్లికి ముందే ఆర్థిక భరోసా… పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించిన సర్ధార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగర రాజకీయాల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ, మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడిగా పేరొందిన కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ మరోసారి తన నిబద్ధతను, ప్రజల పట్ల తనకున్న ఆత్మీయతను చాటిచెప్పారు. తన 58వ డివిజన్ కు చెందిన దుర్శెట్టి ప్రసూన–మహేంద్ర చారి దంపతుల పుత్రిక చిలసౌ అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహ మహోత్సవానికి సర్ధార్ రవీందర్ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ముందుగానే కార్యరూపంలోకి తీసుకువచ్చి, ఆడబిడ్డ వివాహానికి రూ.25,000 ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వధూవరులతో ముచ్చటిస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, “ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి ఓటు నాకు బాధ్యత. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రతి ప్రజా ప్రతినిధి కర్తవ్యం. ప్రజల కష్టాల్లోనే కాదు… వారి సంతోషాల్లో కూడా భాగస్వామ్యం కావడమే నిజమైన ప్రజా సేవ” అని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని అన్నారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని గుర్తుచేస్తూ, ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట… పెళ్లికి ముందే ఆర్థిక సహాయం… పట్టుచీరతో ఆడబిడ్డకు కానుక… పెళ్లి వేడుకకు స్వయంగా హాజరై ఆశీర్వాదం… ఇలా మాట నుంచి చేతల వరకు తన నిబద్ధతను చూపించారని స్థానికులు ప్రశంసించారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు ఆత్మీయంగా హాజరవుతూ కుటుంబ సభ్యుడిలా పలకరించడం సర్ధార్ రవీందర్ సింగ్ కి ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. *“మాటలు చెప్పే నాయకుడు కాదు… ఇచ్చిన మాటను చేతల్లో చూపించే నాయకుడు”*
- మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీపీ గౌష్ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.1
- కరీంనగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకుని మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఘనంగా శోభాయాత్ర మిలాద్-ఉన్-నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో భారీ శోభాయాత్ర చేపట్టారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో శాంతి, సోదరభావ సందేశాలను చాటారు. యువకులు పవిత్ర పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, ప్రజాప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.3
- జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు. స్వీట్ హౌస్ నిర్వాహకుడు డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.2
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- *కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు* *కోడెల మృతిపై విచారణకు ఆదేశం* *నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం* *రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు* వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు... ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.. వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.4
- కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు కోడెల మృతిపై విచారణకు ఆదేశం నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు.ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4