logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభ నిర్వహణ..డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కలెక్టర్లు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, గ్రామసభ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన డిప్యూటీ సిఎం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభ నిర్వహించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ, వార్డుసభల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ములుగు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకే రీతిన ఉండాలని, గ్రామ సభలకు వార్డు మెంబర్ నుంచి ఎంపీ, మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల చేత గ్రామ సభలలో మాట్లాడించాలని అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్యక్రమంతో పాటు, పాలు, రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని అన్నారు. సాంస్కృతిక శాఖ కళాకారులను ఉపయోగిస్తూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. గ్రామాలకు ప్రభుత్వం భారీ ఎత్తున విడుదల చేసిన నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ కె.రామకృష్ణా రావు మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ సత్వర పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, అదే స్పూర్తితో ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి జిల్లాలో గ్రామ సభలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై రిపోర్టు అందించాలని కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా గ్రామసభలో ఉండాలని అన్నారు. గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియ జేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామసభ తరహాలో మున్సిపాలిటీ వార్డులో సైతం సభలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదించిన వివిధ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా గ్రామ, వార్డు సభలలో ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తెలిసే విధంగా వార్డు సభలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 తేదీన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ, వార్డు సభలు నిర్బహణపై ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం, జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నియమితులైన ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను తప్పనిసరిగా నిర్వహించి, నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రజలందరూ గ్రామ సభలకు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను వెల్లడించి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డి పి ఓ వెంకయ్య, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, డి ఈ ఓ సిద్ధార్థ రెడ్డి, డి ఏ ఓ సురేష్ కుమార్, సిపిఓ ప్రకాశ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
3 hrs ago
3c2b552a-a944-4375-b237-ad786b437895

ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభ నిర్వహణ..డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కలెక్టర్లు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, గ్రామసభ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన డిప్యూటీ సిఎం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభ నిర్వహించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ, వార్డుసభల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ములుగు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకే రీతిన ఉండాలని, గ్రామ సభలకు వార్డు మెంబర్ నుంచి ఎంపీ, మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల చేత గ్రామ సభలలో మాట్లాడించాలని అన్నారు. జూన్ 2 నుంచి ప్రారంభించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్యక్రమంతో పాటు, పాలు, రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని అన్నారు. సాంస్కృతిక శాఖ కళాకారులను ఉపయోగిస్తూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. గ్రామాలకు ప్రభుత్వం భారీ ఎత్తున విడుదల చేసిన నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షిస్తూ విజయవంతంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ కె.రామకృష్ణా రావు మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ సత్వర పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమానికి మంచి

03dcaa59-ad96-4799-80fc-f1287c694a9e

స్పందన వచ్చిందని, అదే స్పూర్తితో ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి జిల్లాలో గ్రామ సభలు ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై రిపోర్టు అందించాలని కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా గ్రామసభలో ఉండాలని అన్నారు. గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియ జేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామసభ తరహాలో మున్సిపాలిటీ వార్డులో సైతం సభలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదించిన వివిధ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా గ్రామ, వార్డు సభలలో ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తెలిసే విధంగా వార్డు సభలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 తేదీన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ, వార్డు సభలు నిర్బహణపై ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం, జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నియమితులైన ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను తప్పనిసరిగా నిర్వహించి, నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రజలందరూ గ్రామ సభలకు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను వెల్లడించి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డి పి ఓ వెంకయ్య, డి ఎం అండ్ హెచ్ ఓ గోపాల్ రావు, డి ఈ ఓ సిద్ధార్థ రెడ్డి, డి ఏ ఓ సురేష్ కుమార్, సిపిఓ ప్రకాశ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    4
    ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 min ago
  • హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    1
    హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.
    2
    ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి  ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.
    1
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన  కవ్వంపల్లి రవి  ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి 
చంపి వేయడంతో వెంటనే  రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా
సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్  చేరుకొని  దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు
రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna
    1
    bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna  ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna
    user_Narige Rajkumar
    Narige Rajkumar
    Actor బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    46 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.