Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు విస్తృత అవగాహన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎస్సై వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఇది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగకరమని సూచించారు.
M D Azizuddin
మహబూబాబాద్ జిల్లాలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు విస్తృత అవగాహన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఎస్సై వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఇది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగకరమని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.4
- Post by Tagore3
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.1