Shuru
Apke Nagar Ki App…
డంపింగ్ యార్డ్ గా మారుతున్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ #yadagirigutta దయచేసి యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వాటిని తొలగించాలని కోరుకుంటున్నాం
Tagore
డంపింగ్ యార్డ్ గా మారుతున్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ #yadagirigutta దయచేసి యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వాటిని తొలగించాలని కోరుకుంటున్నాం
More news from తెలంగాణ and nearby areas
- జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.1
- తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో మొదట సిలువ ఊరేగింపు తో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ ఎమెరిటస్ ఆర్.టి. రెవ. టి.ఎస్. కనక ప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. సకల మానవాళి రక్షణ కోసం యేసు సిలువ లో మరణించిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- Post by Tagore1
- జనగామ జిల్లాలోని బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులు, భోజన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు స్వయంగా గణితం బోధించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం పునశ్చరణపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్వో అన్నపూర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముచ్చటగా మూడోసారి ఈ రోజు నిర్వహించారు. 51 రోజులుగా క్యాంపులో ఉన్న బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేలా బిఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించడంతో బిఆర్ఎస్ కు చెందిన 10 మంది, సీపీఐకి చెందిన 4 గురు కౌన్సిలర్లతో కరీంనగర్ నుంచి క్యాతన్ పల్లికి బయలుదేరారు. ఈసందర్భంగా మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావణకాష్టంలా, పోలీస్ రాజ్యంలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిజమైన ప్రజాతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ప్రజాపాలన కాదు, పాపపుపాలన దోపిడీ దొంగల పాలన సాగుతుందని ఆరోపించారు. విచ్చలవిడి అవినీతి, దోపిడి జరుగుతుందని, దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడకుంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు ఉరివేయక తప్పదని బాల్క సుమన్ హెచ్చరించారు.2