ఐఒబి బ్యాంకు ను సందర్శించిన యంపి కలిశెట్టి అప్పలనాయుడు. *రణస్థలంలో IOB బ్యాంక్‌ను సందర్శించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ⭐ శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు బ్యాంక్ అధికారుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సేవలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులు, యువతకు రుణ సదుపాయాలు, పొదుపు ఖాతాలు, డిజిటల్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలు తదితర ప్రజలకు ఉపయోగకరమైన సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రణస్థలం పరిసర ప్రాంతాల ప్రజలకు సులభమైన, వేగవంతమైన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, ఆర్థిక స్వావలంబనకు IOB మరింతగా తోడ్పడాలని ఎంపీ గారు ఆకాంక్షించారు.
ఐఒబి బ్యాంకు ను సందర్శించిన యంపి కలిశెట్టి అప్పలనాయుడు. *రణస్థలంలో IOB బ్యాంక్‌ను సందర్శించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ⭐ శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు బ్యాంక్ అధికారుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సేవలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులు, యువతకు రుణ సదుపాయాలు, పొదుపు ఖాతాలు, డిజిటల్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాల ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాలు తదితర ప్రజలకు ఉపయోగకరమైన సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రణస్థలం పరిసర ప్రాంతాల ప్రజలకు సులభమైన, వేగవంతమైన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, ఆర్థిక స్వావలంబనకు IOB మరింతగా తోడ్పడాలని ఎంపీ గారు ఆకాంక్షించారు.
- పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో మన్యం జిల్లా పాలకొండలో కొలువై ఉన్న శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం గర్భాలయ ముఖద్వారానికి ఒక భక్తుడు కొత్త ఏడుకొండలు ఇత్తడి ఇత్తడి రేకు తాపడం జరిగింది.కొత్త ఏడుకొండలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.1
- సంతకవిటి మండలం లో ఈదురు గాలి లో తో కూడిన వర్షం ప్రజలు అంత సూరక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచనలు సంతకవిటి మండలం లో మంగళవారం ఒక్కసారి గా వాతావరణం లో మార్పులు చోటు చేసికొని వర్షం పడింది.పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలుoత సురక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచించారు.1
- నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.1
- బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు1
- రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...! బుడా చైర్మన్ - తెంటు లక్ష్మునాయుడు..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.3
- స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.1
- విజయనగరం జిల్లా స్వచ్ఛత హే సేవ 2026 విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి.. విజయనగరం, సెప్టెంబరు 16: జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కార్యక్రమాల షెడ్యూల్ మరియు విధివిధానాలను వెల్లడించారు. *స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :* సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు. సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం. సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు. సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన. సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు. సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ. సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం. సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం. అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం. అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. *అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు:* పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలి. ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు, డీపీవో మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీవో పీ. బాలాజీ తదితర అధికారులు, ఆన్లైన్ ద్వారా ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.1
- మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక మృతదేహాన్ని మోయలేక అవస్థలు.. దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గ్రామం నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో పాత పద్ధతిలో పొలాలలో గట్టులపైన మృతదేహాన్ని పట్టుకొని తీవ్ర కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి దగ్గర్లో స్మశాన వాటిక నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.1