రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న మూలవాగు...నిమ్మపల్లి ప్రాజెక్ట్ జలకళ...ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండి, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న మూలవాగు...నిమ్మపల్లి ప్రాజెక్ట్ జలకళ...ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండి, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం
నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య
తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ...
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.4