logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సమ్మె విరమించి మంత్రి శ్రీ Satya Kumar Y గారిని కలిసిన జూడా ప్రతినిధులు... అమరావతిలో జూనియర్‌ డాక్టర్ల (జూడా) ప్రతినిధులు సమ్మె విరమించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా జూడాల స్టైఫండ్‌ పెంపు, రిటైర్మెంట్‌ వయసు, నాన్‌ క్లినికల్‌ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అభ్యర్థుల నియామకం తదితర అంశాలపై చర్చించారు. జూడాల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. స్టైఫండ్‌ అంశంపై ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, జూడా ప్రతినిధులతో చర్చించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించిన జూడా ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ గారు కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు

12 hrs ago
user_Pv sivakumar
Pv sivakumar
Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
8114f1b3-5cd7-4e48-9861-ccc16396c205

సమ్మె విరమించి మంత్రి శ్రీ Satya Kumar Y గారిని కలిసిన జూడా ప్రతినిధులు... అమరావతిలో జూనియర్‌ డాక్టర్ల (జూడా) ప్రతినిధులు సమ్మె విరమించి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని

15d915de-41e3-4a6f-b919-39a6ea93fd41

కలిశారు. ఈ సందర్భంగా జూడాల స్టైఫండ్‌ పెంపు, రిటైర్మెంట్‌ వయసు, నాన్‌ క్లినికల్‌ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అభ్యర్థుల నియామకం తదితర అంశాలపై చర్చించారు. జూడాల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. స్టైఫండ్‌ అంశంపై

72ba1312-7c85-4d56-bad1-2b91a7358b4e

ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, జూడా ప్రతినిధులతో చర్చించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం

2ceeb2e3-b42b-41dc-9a72-a97bbf76af42

చేశారు. ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించిన జూడా ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ గారు కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    1
    పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి
కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని
తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    1
    ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.
    1
    రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో  వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ  దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని  ప్రజలు రోగాల బారి నుండి  కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు  అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో   ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు   తదుపరి భక్తులకు అన్న ప్రసాదం  పెట్టారు.
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    1
    కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట.......



కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు.
ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 

ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 
ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
    1
    బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.
బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు.
రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు.........
ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.