ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కన్నా ఎన్నిక - తాడిపత్రి జర్నలిస్టుల హర్షం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడిపత్రి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కన్నా ఎన్నికయ్యారు.మంగళవారం అనంతపురం పట్టణంలోని మెడికల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఐ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రేపటి రామాంజనేయులు,ప్రధాన కార్యదర్శిగా ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జ్ శివప్రకాష్, ఉపాధ్యక్షుడిగా తాడిపత్రికి చెందిన కన్నా, బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీగా బీఆర్కే న్యూస్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కన్నా ఎన్నిక పట్ల తాడిపత్రి ప్రాంత జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కన్నా ఈ సందర్భంగా తెలిపారు...
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కన్నా ఎన్నిక - తాడిపత్రి జర్నలిస్టుల హర్షం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా తాడిపత్రి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కన్నా ఎన్నికయ్యారు.మంగళవారం అనంతపురం పట్టణంలోని మెడికల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఐ న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రేపటి రామాంజనేయులు,ప్రధాన కార్యదర్శిగా ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జ్ శివప్రకాష్, ఉపాధ్యక్షుడిగా తాడిపత్రికి చెందిన కన్నా, బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీగా బీఆర్కే న్యూస్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కన్నా ఎన్నిక పట్ల తాడిపత్రి ప్రాంత జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కన్నా ఈ సందర్భంగా తెలిపారు...
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.2
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1