logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు మార్గదర్శకమని, రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

13 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
13 hrs ago
e58f5bd4-c070-4c14-a508-d94bb988f90c

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు మార్గదర్శకమని, రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు  వెంకటే గౌడ  ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున  ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...
    1
    తేదీ.14.04.2026.కడప
*కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు*
కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి 
సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఆయనను స్మరించుకుంటూ
జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా 
వారు మాట్లాడుతూ,,
పేద బడుగు బలహీన వర్గాల 
శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు.
సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు.
భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు 
వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు.
ఈ కార్యక్రమంలో,
కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు,
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్,
టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్,
ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు,
ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య,
తిత్తల విశ్వనాధ్,
స్వర్ణ లక్ష్మీనారాయణ, 
టిఎన్ఎస్ఎఫ్ నగర  నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ
కార్యకర్తలు పాల్గొన్నారు...
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    4 hrs ago
  • అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం.. * ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
    4
    అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం..
* ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు.
అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.
పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS SP నెల్లూరు రోడ్ ప్రమాద బాధితులకు వరం పీఎం రాహాత్ పథకం మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా అడిషనల్ SP శ్రీమతి సౌజన్య గారు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్ పాల్గొన్నారు
    1
    నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS  SP నెల్లూరు
రోడ్ ప్రమాద బాధితులకు వరం
పీఎం రాహాత్ పథకం  మెడికవర్ హాస్పిటల్  క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని  వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్  హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా  అడిషనల్ SP శ్రీమతి సౌజన్య  గారు తెలిపారు. 
కేంద్ర రోడ్డు రవాణా  రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. 
ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా  ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో   Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్  పాల్గొన్నారు
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Palakattu nagendra
    1
    Post by Palakattu nagendra
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • చిత్తూరు జిల్లా,పంజాని పోలీస్ స్టేషన్14-04-2026రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు తాలూకా, సూరంకుటై గ్రామానికి చెందిన B. శేఖర్ (60 సంవత్సరాలు) అనే వ్యక్తి 12-04-2026 తేదీన రాత్రి సుమారు 08.00 గంటలకు పంజాని పోలీస్ స్టేషన్‌కు హాజరై ఫిర్యాదు చేయగా, ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం వారిపై అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. దీనిపై పంజాని పోలీస్ స్టేషన్‌లో Cr. No. 40/2026, U/Sec 318(4), 62 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశరాముడు ఆధ్వర్యంలో పంజాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శ్రీ మారెప్ప సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి, 13-04-2026 సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలకు “రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి మోసపూరిత మాటలు నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే అప్రమత్తమై, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా డయల్ 112 కి సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు: A1 - కృష్ణప్ప @ గణపతి, కుంభారలపల్లి గ్రామం, V.కోట మండలం, చిత్తూర్ జిల్లా. A4 - ఎరుకుల విజయ్ కుమార్, మేకలచిన్నెపల్లి గ్రామము, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా. A5 - K.M. మునీష్, కురుగల్ గ్రామము, కొలార్ తాలూకా మరియు జిల్లా. A6 - షేక్ ఇలియాజ్, కమ్మేపల్లి గ్రామము, V.కోట మండలం, చిత్తూరు జిల్లా.పరారిలో ఉన్న ముద్దాయిలు: A2 – శంకర్, రాజులూరు గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా. A3 - నాగరాజు, గౌనివారిపల్లి గ్రామం, పెద్ద పంజాణి మండలం, చిత్తూరు జిల్లా.
    1
    చిత్తూరు జిల్లా,పంజాని పోలీస్ స్టేషన్14-04-2026రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు.
తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు తాలూకా, సూరంకుటై గ్రామానికి చెందిన B. శేఖర్ (60 సంవత్సరాలు) అనే వ్యక్తి 12-04-2026 తేదీన రాత్రి సుమారు 08.00 గంటలకు పంజాని పోలీస్ స్టేషన్‌కు హాజరై ఫిర్యాదు చేయగా, ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం వారిపై అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు.
దీనిపై పంజాని పోలీస్ స్టేషన్‌లో Cr. No. 40/2026, U/Sec 318(4), 62 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడింది.
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS  ఆదేశాల మేరకు, పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశరాముడు ఆధ్వర్యంలో పంజాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శ్రీ మారెప్ప  సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి, 13-04-2026 సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
ప్రజలకు “రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి మోసపూరిత మాటలు నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే అప్రమత్తమై, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా డయల్ 112 కి సమాచారం ఇవ్వాలి.
అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు:
A1 - కృష్ణప్ప @ గణపతి, కుంభారలపల్లి గ్రామం, V.కోట మండలం, చిత్తూర్ జిల్లా.
A4 - ఎరుకుల విజయ్ కుమార్, మేకలచిన్నెపల్లి గ్రామము, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా.
A5 - K.M. మునీష్, కురుగల్ గ్రామము, కొలార్ తాలూకా మరియు జిల్లా.
A6 - షేక్ ఇలియాజ్, కమ్మేపల్లి గ్రామము, V.కోట మండలం, చిత్తూరు జిల్లా.పరారిలో ఉన్న ముద్దాయిలు:
A2 – శంకర్, రాజులూరు గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా.
A3 - నాగరాజు, గౌనివారిపల్లి గ్రామం, పెద్ద పంజాణి మండలం, చిత్తూరు జిల్లా.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    2
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఘనంగా వావిళ్ళ మసీద్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి విడవలూరు మండలం వావిళ్ళ మసీద్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వజయంతి సందర్భంగా డీజే లతో, బ్యాండ్ మేళంతో, బాణా సంచాలతో ఘనంగా ఊరంతా ఒక పండగల జరగటం అలాగే ర్యాలీ నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోసురేష్ మాట్లాడుతూ వావిళ్ళ మసీద్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సెంటర్లో విగ్రహం వద్ద పూలమాలలు వేసి డీజేలాతో,బాణాసేంచ తో చేయటం జరిగింది డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశంలోనే కాదు ఎన్నో దేశాలలో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్లు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మేమెప్పుడూ రుణపడి ఉంటామని ఇక్కడ వావిళ్ళమసీద్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
    4
    ఘనంగా వావిళ్ళ మసీద్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
విడవలూరు మండలం  వావిళ్ళ మసీద్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వజయంతి సందర్భంగా డీజే లతో, బ్యాండ్ మేళంతో, బాణా సంచాలతో ఘనంగా ఊరంతా ఒక పండగల జరగటం అలాగే ర్యాలీ నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి విజయవంతం  చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోసురేష్ మాట్లాడుతూ వావిళ్ళ మసీద్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సెంటర్లో విగ్రహం వద్ద పూలమాలలు వేసి డీజేలాతో,బాణాసేంచ తో చేయటం జరిగింది డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశంలోనే కాదు ఎన్నో దేశాలలో డాక్టర్ బి.ఆర్  బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్లు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మేమెప్పుడూ రుణపడి ఉంటామని ఇక్కడ వావిళ్ళమసీద్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.