రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన నలుగురు వారిని అరెస్టు చేసిన పంజాని పోలీసులు చిత్తూరు జిల్లా,పంజాని పోలీస్ స్టేషన్14-04-2026రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు తాలూకా, సూరంకుటై గ్రామానికి చెందిన B. శేఖర్ (60 సంవత్సరాలు) అనే వ్యక్తి 12-04-2026 తేదీన రాత్రి సుమారు 08.00 గంటలకు పంజాని పోలీస్ స్టేషన్‌కు హాజరై ఫిర్యాదు చేయగా, ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం వారిపై అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. దీనిపై పంజాని పోలీస్ స్టేషన్‌లో Cr. No. 40/2026, U/Sec 318(4), 62 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశరాముడు ఆధ్వర్యంలో పంజాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శ్రీ మారెప్ప సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి, 13-04-2026 సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలకు “రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి మోసపూరిత మాటలు నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే అప్రమత్తమై, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా డయల్ 112 కి సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు: A1 - కృష్ణప్ప @ గణపతి, కుంభారలపల్లి గ్రామం, V.కోట మండలం, చిత్తూర్ జిల్లా. A4 - ఎరుకుల విజయ్ కుమార్, మేకలచిన్నెపల్లి గ్రామము, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా. A5 - K.M. మునీష్, కురుగల్ గ్రామము, కొలార్ తాలూకా మరియు జిల్లా. A6 - షేక్ ఇలియాజ్, కమ్మేపల్లి గ్రామము, V.కోట మండలం, చిత్తూరు జిల్లా.పరారిలో ఉన్న ముద్దాయిలు: A2 – శంకర్, రాజులూరు గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా. A3 - నాగరాజు, గౌనివారిపల్లి గ్రామం, పెద్ద పంజాణి మండలం, చిత్తూరు జిల్లా.

- ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రతృత్వం కోసం జీవితాంతం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.1
- Post by Rajinikanth1
- *ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* *అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమర్* భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..1
- Post by Nageshwari Nageshwari4
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- విద్యతోనే విముక్తి సాధ్యమని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి, సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ ఆధ్వర్యంలో పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు. వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన మార్గం సమానత్వం, న్యాయం వైపు సమాజాన్ని నడిపించే శాశ్వత దీపస్తంభంలా నిలుస్తోంది అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ నాయుడు, పుష్ప రాజ్, ప్రహల్లాద, కేశవులు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1