మక్కల కొనుగోలు సమస్యలతో రైతుల ఇబ్బందులు – శాతపురం క్రాస్ రోడ్డులో ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన జనగాం జిల్లా:పాలకుర్తి మండలం శాతపురం క్రాస్ రోడ్డు వద్ద మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బస్తాల కొరతతో పాటు లారీలు రాక మండుటెండలో పడిగాపులు కాస్తున్న రైతులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మక్కల రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందని విమర్శించారు. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడం, పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండినా కొనుగోలు కేంద్రాలు సరిపడా ప్రారంభం కాలేదని, ఉన్న కేంద్రాల్లో కూడా బస్తాలు, లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మద్దతు ధర రూ.2400 ఉండగా రైతులు రూ.1600–1800కే అమ్ముకోవాల్సి వస్తోందని, పక్క రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని, బోనస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు కరెంటు, రైతుబంధు, బోనస్, మద్దతు ధర ఏదీ అందడం లేదని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మక్కల కొనుగోలు సమస్యలతో రైతుల ఇబ్బందులు – శాతపురం క్రాస్ రోడ్డులో ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన జనగాం జిల్లా:పాలకుర్తి మండలం శాతపురం క్రాస్ రోడ్డు వద్ద మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, బస్తాల కొరతతో పాటు లారీలు రాక మండుటెండలో పడిగాపులు కాస్తున్న రైతులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మక్కల రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందని విమర్శించారు. రైతుబంధు సకాలంలో ఇవ్వకపోవడం, పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు.
రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండినా కొనుగోలు కేంద్రాలు సరిపడా ప్రారంభం కాలేదని, ఉన్న కేంద్రాల్లో కూడా బస్తాలు, లారీలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మద్దతు ధర రూ.2400 ఉండగా రైతులు రూ.1600–1800కే అమ్ముకోవాల్సి వస్తోందని, పక్క రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని, బోనస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు కరెంటు, రైతుబంధు, బోనస్, మద్దతు ధర ఏదీ అందడం లేదని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న మనస్తాపంతో ఆయన నిప్పంటించుకున్నట్లు కార్మికులు తెలిపారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద, సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.1
- హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.1
- గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.1
- Post by User4017 Budhiya Kan ke2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి ఆరుగురు గాయపడగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, కరెంట్ వైరస్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బారీగేట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోడ్లపై పడిపోయాయి. రోడ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన ధాటిక రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా, మరికొన్ని చోట్ల భారీ చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. కాలి వానకు తోడు అకాల వర్షం అన్నదాతలు అందులో గురిచేస్తుంది. కల్లాల్లో దాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.4
- నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.1
- బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన, మక్క మరియు ప్రొద్దుతిరుగుడు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తూకం ప్రక్రియలో ఆలస్యం, కోటా పేరుతో పరిమిత కొనుగోళ్లు, మాయిశ్చర్ కారణంగా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్‌లో త్రాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస వసతులు లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి పక్షాన నిలుస్తామని తెలిపారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం కార్మికుల సమ్మె సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే సహచరులు మంటలను ఆర్పి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.1