*వీరోచిత పోరాట వీరుడు వడ్డే ఓబన్న* _మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు_ _ముచ్చినపల్లిలో ఓబన్న విగ్రహావిష్కరణ_ *రెడ్డిగూడెం, ఏప్రిల్ 16, (గళమ్ న్యూస్)* మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన దివంగత వడ్డే ఓబన్న పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి,మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న నిలువెత్తు విగ్రహాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఏపీ స్టేట్ ఎస్సి కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్,వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ వడ్డెర గురువారం ఆవిష్కరించారు.జోహార్ వడ్డే ఓబన్న అంటూ నినదించారు.ఇక్కడ ఓబన్న విగ్రహ దాత మైలవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వేముల బాబుని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ వడ్డే ఓబన్న ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు.కూటమి ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.మైలవరం పట్టణంలో ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.త్వరలోనే ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సన్నిహితుడైన ఓబన్న నల్లమల కేంద్రంగా గెరిల్లా పద్ధతుల్లో తెల్లదొరలపై పోరాటం చేశారన్నారు.కర్నూలు శివారులోని జగన్నాథ కొండపై పట్టుబడి 39 ఏళ్లకే వడ్డె ఓబన్న అమరత్వం పొందారన్నారు.రేనాటి వీరుడు ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలపాలని అన్నారు.ఆయన ఆశయాలను సాధిస్తామన్నారు.వడ్డే ఓబన్న కేవలం వడ్డెర సోదరుల నాయకుడే కాదని,యావత్ భరత జాతి ముద్దుబిడ్డ అని అన్నారు.చిన్నవయస్సులోనే వీరమరణం పొందిన ఓబన్న ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు.వడ్డెర రాజులు కష్టజీవులు,శ్రమ జీవులన్నారు.యంత్రాలు లేని రోజుల్లో వారు ఎంతో శ్రమించారని అన్నారు.వారు సామాజికంగా,రాజకీయంగా ఎదిగేందుకు అందరూ చేయూతనివ్వాలని అన్నారు.తనవంతు వడ్డెర రాజులకు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డెర రాజులకు నియోజకవర్గంలో అన్ని విధాలుగా సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.సొసైటీ అధ్యక్షులుగా కొందరిని నియమించామని,జెటిపిటి మహాలక్ష్మిని వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గా,మైలవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వేముల బాబును నియమించామన్నారు.రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వడ్డెర సోదరులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) తదితరులు పాల్గొన్నారు.

- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by దాసరి ప్రేమ్1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- Post by Syyed taher1
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- Post by Ippili tulasi1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1